KGF Garuda : ప్రస్తుత తరుణంలో ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే చాలు.. ఏ భాషకు చెందిన చిత్రాన్ని అయినా సరే ఆదరిస్తున్నారు. అనేక సినిమాలు పలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కథ బాగుంటే ఏ చిత్రాన్ని అయినా సరే హిట్ చేస్తున్నారు. అలా హిట్ అయిన చిత్రాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. కన్నడ చిత్రమే అయినప్పటికీ కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. అనే భేదం లేకుండా అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో యష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొదటి పార్ట్ రూ.250 కోట్లను వసూలు చేయగా.. రెండో పార్ట్ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇక మొదటి పార్ట్‌లో విలన్‌గా చేసిన రామ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన పూర్తి పేరు రామచంద్ర రాజు. ఆయన యష్‌కు పర్సనల్ బాడీ గార్డ్. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి పార్ట్ విలన్‌కు అయితే రామ్ సరిపోతాడని భావించి ఆయనను ఎంపిక చేశారు. దీంతో రామ్ లైఫ్ మారిపోయింది. కేజీఎఫ్ హిట్ అవడం, రామ్ నటనకు ప్రశంసలు దక్కడంతో ఆయనకు ఇతర భాషల చిత్రాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇక రామ్‌ను అందరూ గరుడ రామ్ అని కూడా పిలుస్తారు.
కేజీఎఫ్ మొదటి పార్ట్‌లో విలన్‌గా ఎవరిని ఎంపిక చేయాలా అని ప్రశాంత్ నీల్ చూస్తున్నప్పుడు ఆయనకు యష్ బాడీగార్డ్ రామ్ కనిపించాడు. దీంతో వెంటనే ఆ విషయాన్ని ప్రశాంత్ నీల్ యష్‌కు చెప్పగా.. యష్ ఓకే అన్నాడు. ఈ క్రమంలోనే రామ్‌కు ఆడిషన్స్ చేశారు. విలన్ రోల్‌కు ఆయన పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. దీంతో కేజీఎఫ్ మొదటి పార్ట్‌లో విలన్‌గా రామ్‌ను తీసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలా రామ్ కాస్తా గరుడ రామ్ అయ్యాడు. కన్నడతోపాటు తమిళం, తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు.