Kethi Reddy : ఏపీలో రాజకీయం ఓ రేంజ్‌లో నడుస్తుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దానికి ధీటుగా ప్రభుత్వానికి చెందిన పలువురు నాయకులు స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డారు. నేను ఏ రోజు కేతిరెడ్డి గురించి మాట్లాడలేదు..కానీ అతనే తాడిపత్రికి వచ్చి నాపై ఇష్టానుసారం మాట్లాడారు..అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది అన్నారు. నన్ను చెప్పుతో కొడుతా అన్నారు ముసలివాడు, కుంటివాడు అని అంటున్నారు.. అది నిజమే కానీ నాలాగా మీరు పని చేయగలరా..? అంటూ ప్రశ్నించారు.
మీరు నా కుమారుల గురించి ఏవేవో మాట్లాడుతున్నారు.. వారు ఎక్కడైనా బతకగలరు..మాకు ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే నా కుమారుడు ఓడిపోయారు. కానీ మీలా మేం జీవించటంలేదు. మీదంతా నేరాల జీవితం. మేమలా జీవించటలేదు అంటూ చెప్పుకొచ్చారు. నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు ఆ విషయం మర్చిపోయారా?.మీ క్త్రెం నెంబర్ లతో సహా చెబుతానంటూ విమర్శించారు జేసీ. మీ కుటుంబం ఎలా బతికిందో చెబుతాను.. చెప్పుతో కొడుదువురమ్మంటూ సవాల్ విసిరారు.
‘మీ చిన్నాన్న చేసిన బీమా అక్రమాల గురించి ఆధారాలు ఇస్తాను చెప్పుతో కొట్టు’ అంటూ మండిపడ్డారు. లండన్ లో వెయిటర్ గా పనిచేసిన కేతిరెడ్డి ఇక్కడికి వచ్చి గొప్పలు చెబుతున్నాడంటూ విమర్శించారు. ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి కేతిరెడ్డి బాధితులు ఆధారాలు ఇస్తామంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపించిన జేసీ..త్వరలోనే నాపై ఉన్న కేసులన్నీ త్వరలోనే కొట్టేస్తారని అన్నారు. మరి ముందు మీపై ఉన్న కేసుల గురించి సమాధానం చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి కేతిరెడ్డి బాధితులు ఆధారాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు జేసీ.