Keerthy Suresh : మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఆ రేంజ్ విజయాన్ని అందుకోలేకపోయింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉంటూ వైవిధ్యమైన పాత్రలు చేస్తుంది. కథ నచ్చితే రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి సిస్టర్‌గా కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ప్రస్తుతం దసరా చిత్రంతో పాటు పలు తమిళ సినిమాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలోను నానా రచ్చ చేస్తుంది. ఒకప్పుడు చాలా సంప్రదాయబద్ధంగా కనిపించే కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ షో పీక్స్‌కి తీసుకెళుతుంది.
కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం దసరా. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కీర్తిసురేశ్ లుంగీ కట్టుకొని డ్యాన్స్ పార్ట్‌నర్లతో కలిసి స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఈ పాటకు ఇరగదీసే స్టెప్పులేసింది. మహానటి సినిమాలో పద్ధతిగా నటించిన నువ్వేనా ఈ పాటలో ఈ రేంజ్ లో డాన్స్ వేసింది అని నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ అమ్మడు తన అందాలు కూడా ఆరబోస్తూ ఇటీవల తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక దసరా విషయానికి వస్తే.. సింగరేణి ప్రాంతంలోని ఓ గ్రామం చుట్టూ కథాంశం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తెలుగుతోపాటు వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీలో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలంగాణ యాసలో పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Our @KeerthyOfficial has shown her mass moves for the MASSIEST LOCAL STREET SONG #DhoomDhaamDhosthaan along with her Dosth 💥
Time for you and your Dosth to get dancing 🕺
– https://t.co/SGhqPKH4J1#Dasara
Natural Star @NameisNani @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/RF485NsM0h— SLV Cinemas (@SLVCinemasOffl) October 14, 2022