Keerthy Suresh : మహానటి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులని అలరించింది. ఈ మధ్య లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి కాస్త నెగెటివిటీని తెచ్చుకున్న కీర్తి సురేష్ సర్కారు వారి పాట చిత్రం నుండి తెగ రచ్చ చేస్తుంది. సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలోను నానా హంగామా చేస్తుంది. క్యూట్ అందాలతో కేక పెట్టించే విధంగా కీర్తి అందాలు ఉంటున్నాయి. బౌండరీలు బ్రేక్ అయ్యేలా తాజగా ఆమె కెమెరాకి పోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
నూలుపోగుల్లాంటి డ్రెస్ ధరించింది కీర్తిసురేష్.. ట్రాన్సపరెంట్‌గా ఉన్న ఈ డ్రెస్‌లో తన పిచ్చెక్కించే అందాలతో దోబూచులాడుతుంది. కైపెక్కించే లుక్స్ తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తూ.. మెంటలెక్కిస్తుంది. ఇందులో మహానటి లుక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. అయితే ఈ అమ్మడు రోజురోజుకి ఇంతలా రెచ్చిపోతుందేంటని కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదైతేనేం ఈ అమ్మడు క్యూట్ లుక్స్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ నిస్తున్నాయి.
కీర్తి సురేష్ నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విశేషంగా ఆకట్టుకుంది. క్యూట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. కొత్త అందం కనువిందు చేయడంతో ఆడియెన్స్ ఆమెకి కనెక్ట్ అయిపోయారు. నేటి తరానికి సావిత్రి అంటే ఇలానే ఉంటుందేమో అనేంతగా మహానటి చిత్రంలో ఆ పాత్రని రక్తికట్టించడం విశేషం. దీంతో విశేష ప్రశంసలందుకుంది కీర్తిసురేష్. తక్కువ వయసులో, కెరీర్ బిగినింగ్‌లోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోవడం అరుదైన విషయం. ఆ అరుదైనఘనత కీర్తి సురేష్ దక్కించుకుంది. ఇటీవల వచ్చిన మహేష్ సినిమా సర్కారు వారి పాట చిత్రం మాత్రమే ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం నానితో చేస్తున్న దసరా సినిమా ఒక్కటే ఆమె చేతిలో ఉంది.