KCR : తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది.బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. అధికారం పోయినా కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభతో ప్రజలలోకి వెళుతున్నారని.. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడైనా ప్రజలలోకి వెళ్లాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉంటే ప్రగతిభవన్‌లో లేదా ఫాంహౌజ్‌లో ఉండేవారని అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డలో కేసీఆర్ సర్కారు అవినీతి భాగోతం బయటపడుతుందనే కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడుతూ ప్రజల దృష్టిని దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో పెరుగుతున్న ఆదరణతో ఓర్వలేక ప్రస్టేషన్‌తో సీఎం రేవంత్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు అసెంబ్లీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఆయన ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని భావించారు. కానీ ఆయన తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆయన సభకు హాజరయ్యే అవకాశముంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. తర్వాత ఆయన కాలికి ఫ్రాక్చర్ కావడంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి సమావేశాలు జరుగుతుండటంతో గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం ఆయన హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.
ఇక కేసీఆర్‌కి ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్‌ను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్‌ను రెండో సమావేశాల్లోపే మార్చేసింది. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చేసింది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఛాంబర్‌ను మార్చారంటూ అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతుంది. అయితే ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న కేసీఆర్.. ఏదో బాత్‌రూంలో కింద పడ్డ నా పని అయిపోందేమో అని అనుకుంటున్నారు. కాని ముందుంది ముసళ్ల పండగ అని కూల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.