KCR : ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. డైరెక్ట్‌గా ఎక్క‌డికి వెళ్లాడంటే..!

KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం త‌న ఇంట్లోని బాత్‌రూంలో కాలు జారిప‌డ‌గా, ఆయ‌న‌కి గత కొద్ది రోజులుగా సోమాజీగూడ యశోధా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నేడు ఆయ‌న ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన్ని ఆస్పత్రి నుంచి.. హైదరాబాద్‌లోనే ఉన్న నందినగర్ లోని పాత ఇంటికి తరలించారు. అక్కడే 6 నుంచి 8 వారాలపాటూ ట్రీట్‌మెంట్ కొనసాగనుంది. అప్పటికి కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారు. తిరిగి ఎప్పటిలాగే ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.నందినగర్ పాత ఇంట్లో కేసీఆర్ దాదాపు తొమ్మిదిన్నరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత నందినగర్ పాత ఇంట్లో బస చేస్తున్నారు.

2000 సంవత్సరంలో ఈ ఇంటిని నిర్మించారు. 2021లో ఓసారి ఇంటిర మరమ్మత్తు పనులు పరిశీలించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ ఇంటి నుంచి కార్యాచరణ రూపొందించారు.కేసీఆర్ ఇంటికి వస్తున్నందున ఇంటిని పూలదండలతో అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు కుటుంబసభ్యులు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జెడ్ ప్లస్ కేటగరీ భద్రను వై కేటగరీకు తగ్గించింది. 4 ప్లస్ 4 గన్‌మెన్‌లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనం మాత్రం కేసీఆర్ భద్రతకు ఉపయోగించనున్నారు.

KCR discharged from hospital gone to home video viral
KCR

ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలుగా పరిమితమైన మాజీ మంత్రులకు 2 ప్లస్ 2 గన్‌మెన్‌లు ఉంచి ఎమ్మెల్యేలుగా లేనివారికి పూర్తిగా గన్‌‌మెన్‌లను తొలగించింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లకు కూడా తొలగించారు. కాగా, డిసెంబర్ 7న రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోని బాత్‌రూంలో కాలు జారి పడ్డారు కేసీఆర్. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగిపోవడంతో, డాక్టర్లు డిసెంబర్ 8న హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. మరో ఎముకను అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ, పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు ముందే చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగవ్వడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

12 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

19 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

3 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago