KBC Sushil Kumar : డబ్బు ఉండగానే సరిపోదు, దాన్ని కాపాడుకోవడం కూడా తెలియాలి. మనం డబ్బు ఎంత సంపాదిస్తున్నాం, మన దగ్గర ఎంత డబ్బు ఉంది.. అన్నది ముఖ్యం కాదు. మనం మన డబ్బును ఎల్లవేళలా సేఫ్ గా ఎలా ఉంచుకున్నాం.. అనేదే ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించకపోతే ఎవరి దగ్గర అయినా సరే కోట్లు ఉన్నా కానీ ఏదో ఒక రోజు బిచ్చగాళ్లుగా మారుతారు. అవును, మీరు విన్నది నిజమే. సరిగ్గా ఆ వ్యక్తి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
2011లో బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి అప్పట్లో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) ప్రోగ్రామ్‌లో ఏకంగా రూ.5 కోట్లను గెలుచుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతని దగ్గర ఉన్న డబ్బంతా పోయింది. ఫ్యామిలీ అందరూ దూరం పెట్టేశారు. అతను ఇప్పుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి పాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది..? అంటే..
సుశీల్ కుమార్‌కు అంత డబ్బు రాగానే చుట్టు పక్కల వారందరూ దాన్ని ఆసరాగా తీసుకుని అతని దగ్గర అప్పులు తీసుకున్నారు. అతను అందరినీ నమ్మి అప్పులు ఇచ్చాడు. అలాగే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టాడు. చెప్పుడు మాటలు విని అతను అలా చేశాడట. దీంతో ఉన్న డబ్బంతా పోయింది. అతనికి వచ్చిన రూ.5 కోట్లు మాత్రమే కాదు, అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం పోయింది. దీంతో అతని భార్య అతన్ని వదిలేసింది. ఫలితంగా అతను చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఇప్పుడు దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు.
అయితే ప్రస్తుతం అతను ఉన్న స్థితిని చూసి నెటిజన్లు జాలిపడుతున్నారు. డబ్బు ఉన్నప్పుడు అందరూ అలాగే దగ్గరకు వస్తారని, ఎవరినీ నమ్మకూడదని, ఎంత డబ్బు ఉందన్నది ముఖ్యం కాదని, దాన్ని ఎలా కాపాడుకున్నామన్నదే ముఖ్యమని వారు అంటున్నారు. మరి అది నిజమే కదా.