Kavya Maran: ఐపీఎల్ వీక్షించే ప్రతి ఒక్కరికి కావ్య మారన్ తప్పక తెలిసి ఉంటుంది. ఎస్.ఆర్.హెచ్ ఎక్కడ ఆడుతున్నా అక్కడ వాలిపోయి.. జట్టును ఎంకరేజ్ చేస్తారు కావ్య. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.. కావ్య పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. మిస్టరీ గర్ల్ కావ్యా మారన్ కోట్ల విలువచేసే వ్యాపారాలకు హెడ్‌గా కూడా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ఆడే సమయంలో కెమెరామ్యాన్స్.. ప్లేయర్స్ కంటే కావ్యపాప హావభావలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటాడు. ఆటగాళ్లు అదరగొడుతుంటే.. ఎగురుతూ కేరింతలు కొట్టే కావ్య.. పేలవ ప్రదర్శన చేస్తుంటే మాత్రం.. చాలా నిరుత్సాహంతో కనిపిస్తూ ఉంటుంది.
సన్ గ్రూప్ మీడియా సంస్థల అధినేత కళానిధి మారన్ తనయే కావ్యా మారన్ కాగా, ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం సీఈఓగా వ్యవహరిస్తున్నారు.క్రికెట్‌తో పాటే ఈమె ఎన్నో కోట్లు విలువచేసే బిజినెస్‌లు నిర్వహిస్తున్నారు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే కాకుండా.. పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న కావ్య.. బాగానే ఆస్తులు కూడబెట్టారు. ఆమె ఆస్తుల నికర విలువ దాదాపు 50 మిలియన్ల డాలర్లు ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ లో 400 కోట్ల పైన ఆస్తి కలిగి ఉన్నారు.
ఆక్షన్ జరిగినప్పుడు మెయిన్ ప్లేయర్స్ ఎవర్ని తీసుకోకుండా అనవసరమైన ప్లేయర్స్ ని కోట్లు పెట్టి కొన్నారు అంటూ కావ్యపై అప్పట్లో ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో హైదరాబాద్ టీం ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన సమయం లో ఆ టీం సీఈఓ అయినా కావ్య మారన్ హాట్ టాపిక్ గా మారింది. కావ్య మారన్ తమిళనాడులో 1992లో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మోరిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం ఫారెన్‌లో మాస్టర్స్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న కావ్య.. సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం ఛానళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారు.