Karunakaran : సాధారణంగా స్టార్ హీరోలకి అభిమానులు ఉంటారు.కాని పవన్ కళ్యాణ్‌కి భక్తులు ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా ప్రేక్షకుల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారు పవర్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’, ‘ఖుషీ’ చిత్రాలు రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో బ్యూటీఫుల్ ఫిల్మ్ రీరిలీజ్ కు సిద్ధమైంది. తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించారు. 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది.
ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా ‘తొలిప్రేమ’ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెర మీద చూసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. జూన్ 30న చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరుణాకరణ్ తో మీడియా ముచ్చటించగా ఆయన ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అమ్మ, నాన్న, పవన్ కళ్యాణ్ అని కరుణాకరణ్ అని అన్నారు.
నా హీరో అతను అని చెపిన కరుణా కరణ్. ఆయనకి సీన్ నచ్చితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముందు మనం ఒక స్టోరీ చెప్పి తర్వాత ఒకటి చెబితే ఇట్టే గుర్తు పడతారు. అప్పుడు ఒకటి చెప్పావు,ఇప్పుడు ఒకటి చెప్పావు ఏంటని ఆయన అంటారు అని కరుణాకరణ్ చెప్పారు. వీలు కుదిరితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉందని కరుణా కరణ్ .. తొలి ప్రేమ 2 పవన్ తనయుడు అకీరా నందన్‌తో చేయాలని భావిస్తున్నట్టుగా తన సన్నిహితులతో చెప్పినట్టు టాక్.