Karate Kalyani : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు కరాటే కళ్యాణి. బాబీ అనే పాత్ర ఆమెకు మంచి పేరు ఎతచ్చి పెట్టింది. బిగ్ బాస్ షోలోను కళ్యాణి పాల్గొనగా, అక్కడ కూడా నానా రచ్చ చేసింది. అయితే ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతుండగా, మరోవైపు వివాదాలతో వార్తలలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది.. కొన్ని నెలల క్రితం యూట్యూబర్‌తో.. కరాటే కళ్యాణి గొడవ ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. మా ఎలక్షన్స్ సమయంలోను నానా రచ్చ చేసింది. తాజాగా కళ్యాణి తన జీవితంలో ఎదుర్కొన్న చేదు, భయానక అనుభవాల గురించి చెప్పుకొచ్చింది
బతుకుతెరువు కోసం నేను సినిమాల్లో నటిస్తున్నాను చెప్పిన ఆమె తనలో ఒకవైపే చూశారని పేర్కొంది. రియల్ లైఫ్‌లో నేను చాలా మందికి సాయం చేస్తాను. వారంతా నాకు చాలా మర్యాద ఇస్తారు. దండం పెడతారు. ఇక నేను సింగింగ్, హరికథ, డ్యాన్స్, యాంకరింగ్, జింగిల్స్ పాడటం వంటివి అన్ని చేశాను. ఇండస్ట్రీలోకి వచ్చాక.. బతకడం కోసం.. డబ్బింగ్ చెప్పడం.. జింగిల్స్ పాడటం చేశాను. ఎంతో కష్టపడ్డాను’’ అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి. ‘‘నాతో తప్పుగా ప్రవర్తించిన చాలా మందిని చితక్కొట్టాను. ఇక నా భర్త నుంచి విడిపోయాను. అతను నన్ను పెట్టిన టార్చర్ మాటల్లో వర్ణించలేను.
ఓ రోజు.. నా భర్త తాగి.. బేగంపేట దగ్గర.. నడి రోడ్డు మీద .. నా బట్టలు లాగేశాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద నాకు ద్రౌపది వస్త్రాపహరణం చేశాడు. ఆ తర్వాత కూడా తను మారలేదు. తాగి వచ్చి చాలా చిత్ర హింసలు పెట్టాడు. ఇక నాకు పెళ్లి మీద విరక్తి కలిసింది. భర్త నుంచి దూరంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికీ మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. నిజమైన ప్రేమ కోసం నేను తపిస్తున్నాను. నన్నుగా ప్రేమించే వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను, అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…