Kantara Review: గత కొద్ది రోజులుగా అందరి నోళ్లలో నానుతున్న కన్నడ చిత్రం కాంతార. రిషబ్ శెట్టి కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా గత నెల 30వ తేదీన కన్నడలో విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ వారు నేడు విడుదల చేశారు. సప్తమి గౌడ కథానాయికగా అలరించిన ఈ సినిమాలో, కిశోర్ .. అచ్యుత్ కుమార్ .. ప్రమోద్ కుమార్ … మనసి సుధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఈ చిత్రం అడవి నేపథ్యంలో నడిచే కథ. రాజ్యాన్ని పాలించే రాజు ఒక దైవదూత సూచన మేరకు తన ఐదొందల ఎకరాల భూమిని గిరిజనులకు రాసిచ్చేస్తాడు. కాల క్రమంలో అతడి వారసుడొకరు ఆ భూమిని తనకి ఇచ్చేయాలని గిరిజనుల మీద ఒత్తిడి తెస్తాడు. కానీ అతను అనూహ్య పరిణామాల మధ్య రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంకో తరం మారాక ఆ చనిపోయిన వ్యక్తి కొడుకైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్) గిరిజనులతో సన్నిహితంగా మెలుగుతుంటాడు. అతడి దగ్గర పని చేస్తూ తన ఊరి వాళ్లకు తలలో నాలుకలా ఉండే శివ (రిషబ్ శెట్టి)కి.. కొత్తగా అటవీ అధికారిగా వచ్చిన మురళి (కిషోర్)కి తగువు మొదలవుతుంది. కొన్ని పరిణామాల తర్వాత శివ సోదరుడు చనిపోతాడు. అతణ్ని చంపింది మురళీనే అనుకుంటాడు శివ. ఇంతకీ శివ సోదరుడిని చంపిందెవరు.. అందుకు కారణమేంటి.. బదులుగా శివ ఏం చేశాడు అన్నది మిగతా కథ.
రంగస్థలంలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇద్దరూ ఒకే పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఇందులోని అచ్యుత్ కుమార్ పాత్ర అలానే ఉంటుంది. ఆ రకంగా స్క్రీన్ ప్లే, గ్రామీణ నేపథ్యాలు రంగస్థలాన్ని గుర్తు చేస్తుంటాయి. మూడు టైం లైన్స్ లో కొనసాగే కథతో సూపర్ నేచురల్ అంశాలతో కూడిన మిస్టరీ కోణం తుంబాడ్ నుంచి స్ఫూర్తి పొందినట్టు అనిపిస్తుంది.
అడవి నేపథ్యంలోని సన్నివేశాలను గొప్పగా తెరకెక్కించాడు. బురదలోను .. వానలోను వచ్చే ఫైట్స్ ను చాలా బాగా చిత్రీకరించాడు. ఇక ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన అవసరమే లేదు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కథలో సర్దిన తీరు బాగుంది. అయితే అడవి నేపథ్యంలో నడిచే కథ అనగానే ప్రేక్షకులు కాస్త నాటు సరసాన్ని .. మోటు శృంగారాన్ని ఆశిస్తారు. అలాంటివారికి మాత్రం కాస్త నిరాశ తప్పదనే చెప్పాలి. అవకాశం ఉన్నప్పటికీ రిషబ్ శెట్టి అటువైపు వెళ్లకపోవడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుందంతే. హీరోగా .. రచయితగా .. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన ఈ విన్యాసాన్ని మాత్రం తప్పక అభినందించాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…