Kantara Film Making : కొద్ది నెలల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార. కథానాయక పాత్రలో రచయిత దర్శకుడు అయిన రిషబ్ శెట్టి చక్కగా ఒదిగిపోయాడు. కాంతార సినిమాలో రిషబ్ శెట్టి ఎంట్రీ సీన్ అదిరిపోయేలా ప్లాన్ చేశాడు. ఎద్దుల్ని పరిగెత్తిస్తూ.. అతడు తన ఎంట్రీని ప్లాన్ చేశాడు, ఈ సినిమాకు దర్శకుడు అతడే కావడంతో… సీన్లను కూడా అద్భుతంగా ప్లాన్ చేశాడు. బిగినింగ్ లో పాడి సీన్, హీరో మాస్ ఎంట్రీ, యాంగిల్స్ రన్నింగ్ ఆడియన్స్ కి క్యూరియాసిటీ కలిగిస్తాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడం విశేషం.
కాంతార సినిమాకి ఫ్రీక్వెల్ రాబోతుండగా, ఈ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపించబోతున్నట్లు తెలియజేశారు.ఇక ఈ చిత్రాన్ని 2024వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా మేకింగ్ సమయంలో హీరో ఎద్దులతో పరిగిత్తే సీన్స్ లో చాలా కష్టపడ్డాడు. ఇక బుక్ మై షోలో ఈ మూవీ 99 శాతం రేటింగ్ పొందగా, ఇది రికార్డ్ అని అంటున్నారు. ఇందులో వీఎఫ్ ఎక్స్ ఏమి వాడకుండా ప్రేక్షకులని సరికొత్త థ్రిల్ కలిగించింది. ఈ మూవీ వలన ఆ కల్చర్‌కి ప్రత్యేక గుర్తింపు లభించింది.
చిత్రంలో శివ తుపాకీ ఎదురు కాల్పులు జరిపి, డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌ను గాయపరిచే సన్నివేశం శెట్టి స్నేహితుడికి జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందించబడింది . అతను మొత్తం కథను రాయడానికి దారితీసిన సంఘటనలలో ఇది ఒకటి. రిషబ్ శెట్టి ప్రకృతి మరియు మానవుల మధ్య జరిగే సంఘర్షణను చిత్ర ఇతివృత్తంగా ఉదహరించారు, 1990 లలో తన స్వస్థలమైన కర్నాటకలోని కెరాడిలో అటవీ అధికారులకు మరియు నివాసితులకు మధ్య జరిగిన కలహాలు చిత్రానికి ప్రేరణగా ఉన్నాయి. అంతిమంగా, శివుడు అనేక పరీక్షల ద్వారా మరియు దైవత్వానికి యోగ్యుడైన తర్వాత.. గుళిగను స్వాధీనం చేసుకోవడం ద్వారా హీరో అవుతాడు. అప్పుడు, కోలా ద్వారా పూజించబడే చాలా మంది దైవాల వలె చివరిలో అడవిలోకి అదృశ్యమవుతాడు.