Kamal Haasan : ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కృష్ణ, కృష్ణంరాజు వంటి లెజెండ్స్ కొద్ది రోజుల గ్యాప్‌తో కన్నుమూయడంతో అభిమానులు చాలా విషాదంలో ఉన్నారు. అయితే ఈ బాధ నుండి మరణించకపోక ముందే కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తుంది. విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా, ఆయనకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కమల్ హాసన్ ను అయన కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నై లోని పోరూరు రామచంద్ర ఆసుపత్రికి కమల్ హాసన్ ను తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయ్యుంటాయని, అందుకనే ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వచ్చాయని కొందరు భావిస్తున్నారు. రీసెంట్‌గానే బంధు మిత్రులు సినీ ప్రముఖులు, సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కమల్ హాసన్ . బుధవారం రోజున హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ ఆయన కళా తపస్వి కె.విశ్వనాథ్‌ని కలిశారు. అయితే కమల్ సడెన్‌గా ఆసుపత్రిలో చేరాడని తెలిసి అభిమానులు , ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
ప్రస్తుతం కమల్.. తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే శంకర్‌తో కలిసి ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సినిమా అంటే ఇష్టపడే వారికి కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వచ్చారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు. దర్శకుడిగానూ ప్రయోగాత్మక చిత్రాలు చేసి మన్ననలు పొందారు. హాలీవుడ్ మూవీ స్టైల్ ను దేశానికి సరికొత్తగా పరిచయం చేశారు. అయితే కమల్ అంతకు ముందు ఓ సారి కరోనా బారిన పడ్డారు. సినిమా చేస్తున్న సమయంలోనే కరోనాతో కొంతకాలం సినిమాకు బ్రేక్ పడింది. కరోనా నుండి కోలుకున్న తరువాత ఆ చిత్రాన్ని పూర్తి చేశారు.