Kalvakuntla Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే. కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మం..ఎగ్జాక్ట్ పోల్స్‌నే నమ్ముతామన్న బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేయగా.. గజ్వేల్‌లో మాత్రమే గెలిచారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు గెలిచారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీచేస్తే..ఒకచోట ఓడిపోయి..మరో చోట విజయం సాధించారు. కొడంగల్‌లో గెలిచి…కామారెడ్డిలో ఓడిపోయారు.
గెలిచిన ఆనందంలో రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తాను. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యతను తీసుకుంటా. దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా నిలబెడతా’’ అని అన్నారు. అయితే ఓటమి తర్వాత కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ చాలా నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది.
కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఫలితం గురించి బాధలేదు. అయితే మేము ఆశించి రీతిలో ఫలితాలు రాకపోవడంతో కచ్చితంగా నిరాశ కలిగించింది. కానీ ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ప్రజా ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. శుభం జరగాలని ఆశిస్తున్నాను’’ అని స్పందించారు. ఇక ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ చేరుకొని కుటుంబ సభ్యుతలో కలిసి ఫలితాలను గమనించింది. ఓటమి తర్వాత వెంటనే అక్కడ నుండి చాలా బాధతో వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కవితకి సంబందించిన క్లిప్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.