Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే కవిత పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను అరెస్ట్ చేసిన సీబీఐ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచింది. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని.. ఆమె నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. కోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు… ఆ తర్వాత కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
తనను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని కవిత అంటుంది.. ‘న్యాయ సలహా కావాలని అడిగినా నన్ను అరెస్ట్ చేశారు. నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి 10:30కు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పాను’ అని పేర్కొన్నారు. అటు, కోర్టులో కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ కవితను అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని.. హక్కులు కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అరెస్టను వ్యతిరేకిస్తూ కవిత 2 పిటిషన్లు దాఖలు చేసింది.
సీబీఐ విచారణ, అరెస్టులపై రెండు అప్లికేషన్లు వేశామని కవిత తరఫు న్యాయవాది చెప్పారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదన్నారు. కవిత విషయంలో సీబీఐ నిబంధనలు పాటించలేదని వెల్లడించారు. కాగా, కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరుతున్నది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంజాన్ సెలవు దినం కావడం, ఈ కేసుకు సంబంధించిన సమాచారం లేదని ప్రతివాదులు చెప్పడంతో ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ సాధ్యం కాదని కోర్టు తెలిపింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…