Kalki 2898AD : ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూడగా, ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. కల్కి సినిమా మీద ఉన్న హైప్, ఇప్పటికే బుకింగ్ అయిన టికెట్స్ చూస్తుంటే కల్కి సినిమా సరికొత్త రికార్డ్స్ చేయడంకి ఎంతో దూరం లేదని అంటున్నారు. చిత్రంలో ప్రభాస్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ రేంజ్ ఎలివేషన్స్ తో చూపించి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు..అలాగే సినిమాలో హీరోయిన్‌లుగా దీపికా పదుకోన్, దిశా పటాని ఎంతగానో అలరించారు. ఈ సినిమాలో దీపికాను కేవలం గ్లామర్ కోసం వాడకుండా కథలో భాగం చేసి తన అద్భుతమైన నటనకు స్కోప్ ఇచ్చారు. అలాగే దిశా పటాని సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది..
అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు..ప్రభాస్,అమితాబ్ మధ్య జరిగే యాక్షన్స్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి..నాగ అశ్విన్ ప్రభాస్, అమితాబ్ చూపించిన తీరు అద్భుతం అని ప్రేక్షకుల నుండి కామెంట్లు వినిపించాయి. ఇక కమలహాసన్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా ఎండింగ్ లో కమల్ పాత్రతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ అని చెప్పకపోయినా కూడా కల్కి యూనివర్స్ ని ప్రకటించాడు. అంటే ఈ సినిమాను మరిన్ని పార్ట్స్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
కల్కి యూనివర్స్ నుంచి రెండో పార్ట్ మరో మూడున్నర ఏళ్లలో రానున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిన చోట నుంచి రెండో పార్ట్ కొనసాగించాలి. అయితే ఈ రెండో పార్ట్ కు ‘కల్కి 3102 BC’ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన దేశ పండితలతో పాటు నాసా కూడా మహా భారతం జరిగింది దాదాపు 3 వేల యేళ్ల క్రితం.. అప్పటి కృష్ణుడి జన్మ నక్షత్రం అనుసరించి గ్రహాలు కూడా అదే స్థానంలో ఉన్నాయి. దీన్ని బట్టి మహా భారతం మన ఇతిహాసంతో పాటు చరిత్ర అని చెప్పొచ్చు. అంతేకాదు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యాగం చేసింది ఈ యేడాదిలోనే కాబట్టి ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టొచ్చు టాక్ నడుస్తోంది.