Kajal Aggarwal : ఈ మధ్య చాలా మంది భామలు తమ అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. లావుగా ఉంటే సన్నగా మారటానికి కూడా బాగా ప్రయత్నాలు చేస్తారు. అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకున్నారు.అందులో కాజల్ అగర్వాల్ కూడా ఒకరని తెలుస్తుంది. ఆమె తను లిప్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. తొలిసారిగా లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్.ఆ తరువాత మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటించింది కాజల్. ఈమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళుతూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.
తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి.అతడిని పెళ్లి చేసుకుంది.అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇక బిడ్డ పుట్టాక కూడా కాజల్ ఎనర్జీ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఆ మధ్య ఫొటో షేర్ చేయగా, అందులో తను అందంగా కనిపించినప్పటికీ కూడా తన ఫేస్ లో ఏదో తేడాగా అనిపించింది.దీంతో ఆ ఫోటోని చూసి నెటిజన్స్ కాజల్ పెదవులను గమనిస్తే ఏదో తేడా కొడుతుంది అంటూ.. బహుశా కాజల్ కూడా పెదవులకు సర్జరీ చేయించుకుందా.అందుకే ఆమె ముఖం అలా కనిపిస్తుందా అని అన్నారు.
అయితే సర్జరీ తర్వాత కాజల్ తెలుగులో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలో మీడియాకి పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. భగవంత్ కేసరి సినిమా గురించి కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ, బాలయ్య ఎప్పుడూ జోవియల్‌లో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. భగవంత్ కేసరి తనకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని తెలిపింది కాజల్.ప్రస్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సత్యభామ సినిమా చేస్తోంది కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతుంది.