Kadiyam Srihari : కాంగ్రెస్‌లో చేరాల‌ని కేసీఆర్, కేటీఆర్‌కి ఫోన్ చేసి చెబితే ఏం అన్నారంటే..?

Kadiyam Srihari : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లోను రాజ‌కీయం మంచి రంజుగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. రీసెంట్‌గా .. వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా.. తాజాగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయని.. నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదని లేఖలో వివరించారు.

బీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించిన స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కాంగ్రెస్‌ పార్టీ బిగ్‌షాక్‌ ఇచ్చినట్టేనని ఆ పారీవర్గాల తాజా సమాచారం. తన కూతురు కావ్యకు వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఆశించి కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, కావ్యకు కాకుండా శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్ఠానం తాజాగా మెలిక పెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి ఉంటుందనే షరతు పెట్టినట్టు కాంగ్రెస్‌ ఢిల్లీ వర్గాల తాజా సమాచారం. ఒకవేళ కడియం శ్రీహరి అందుకు అంగీకరించని పక్షంలో వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ లేక దొమ్మాటి సాంబయ్య పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

Kadiyam Srihari sensational comments before joining in congress
Kadiyam Srihari

అయితే ఈ క్ర‌మంలో క‌డియం శ్రీహ‌రి.. త‌న పార్టీ అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వారితో చర్చించారు. గత 30 ఏళ్లుగా తనకు ఉండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అనుచరుల భవిష్యత్తు కోసమే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని.. జిల్లా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో ఉండటమే మేలని అన్నారు. ఇలా పార్టీ మార్పుపై తన అభిప్రాయాన్ని కార్యకర్తలకు వెల్లడించారు. క‌డియం పార్టీ చేంజ్ గురించి త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న అయితే రానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago