KA Paul : కేఏ పాల్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు అందుకున్న పాల్ ఇప్పుడు మాత్రం కామెడీ పీస్‌గా మారాడు. తాజాగా యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు కేఏ పాల్. కేసీఆర్ తొందరగా కోలుకోవాలని ఆయన ప్రార్థనలు చేశారు. కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యం పట్ల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. కేటీఆర్కూడా ఎంత బిజీగా ఉన్న కేసీఆర్ ను చూసేందుకు వచ్చిన వారిని హార్ట్ ఫుల్ గా రిసీవ్ చేసుకొని అందరితో ఓపికగా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దేవుడికి 75 ఏళ్ల వయసులో దగ్గరవుతున్నారని అన్నారు.
రాజకీయాలు చేయడానికి తాను ఆసుపత్రికి రాలేదని అన్నారు. కేటీఆర్ ను ఇంతవరకు కలవలేదని.. కేసీఆర్ ఆసుపత్రిలో చేరడం.. నేను చూసేందుకు రావడం.. కేటీఆర్ ను కలవడం అంత దైవ నిర్ణయం అని అన్నారు. అయితే సర్జరీ అయిన తర్వాత ఆయన లేచి నలవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయనకి ఎవరు ప్రేయర్స్ చేసారో అర్ధం కావడం లేదు. ఆఫీసులో ఫైల్స్ మిస్ అవుతున్నాయి.. ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు అని కేఏ పాల్ సెటైర్స్ వేశారు.
ఇక ఇదిలా ఉంటే కేసీఆర్ ఇంత త్వరగా కోలుకోవడం మంచి పరిణామం. కోకొనట్ ఆయిల్ తెచ్చి కేసీఆర్ కోలుకోవాలని ఏసుప్రభువుకి ప్రార్థన చేశాను. కేసీఆర్ స్పిరిచ్యూవల్ పర్సన్. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కేసీఆర్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యలకు రావాలని ప్రేయర్ చేశాను’’ అని కేఏ పాల్ తెలిపారు.రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరని… కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించడం శుభపరిణామమని అన్నారు. త్వరలోనే కేసీఆర్ అద్భుతమైన స్వస్థత పొందుతారని, గతంలో కంటే యాక్టివ్ గా ఉంటారని చెప్పారు.