Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jr NTR Rare Photos : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రేర్ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు..!

Shreyan Ch by Shreyan Ch
January 23, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jr NTR Rare Photos : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న చిత్రం దేవర. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయిక. సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాప్ ప్రొడ్యూసర్లు కూడా రంగంలోకి దిగారని, వారినుంచి నిర్మాతలకు భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

Jr NTR Rare Photos have you seen them
Jr NTR Rare Photos

ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ లెక్కలను చూసి టాలీవుడ్ షేకవుతోందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ అందించారు. దేవర కూడా హిట్టయితే తారక్ ఇమేజ్ ఒక రేంజ్ లో ఉంటుందని, సినిమా విజయాన్ని బట్టి పాన్ ఇండియాగానే కాకుండా అంతర్జాతీయంగా వివిధ భాషల్లోకి అనువదించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ గురించి తాజాగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983 లో మే 20న హైదరాబాద్ లో జన్మించిన ఎన్టీఆర్ చిన్న‌నాటి పిక్ ఒక‌టి నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇది చూసిన వారంద‌రు అవాక్క‌వుతున్నారు.

గుడివాడలో ఉన్న మొంటిస్సోరి స్కూల్ లో ప్రాధమిక చదువు పూర్తిచేసిన ఎన్టీఆర్, ఇంటర్ హైదరాబాద్ లో సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. చదువుతో పాటుగా నటన మరియు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నాడు.

తన తాతగారు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు,‘బాల రామాయణం’ సినిమాలో రాముడుగా నటించాడు. ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఆ తరువాత 2001 లో ‘నిన్నుచూడాలని’ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాదిలో రిలీజ్ అయిన ‘ స్టూడెంట్ నెం .1’ మూవీ విజయం సాధించడంతో ఇక ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు..

Tags: Jr NTR Rare Photos
Previous Post

Celebrities : అయోధ్య రాముడికి సిని సెల‌బ్రిటీల నుండి ఎవ‌రెవ‌రు ఎంత విరాళం ఇచ్చారంటే..!

Next Post

YS Sharmila : ష‌ర్మిల కొడుకు నిశ్చితార్థంలో ఈ రెండు ప్ర‌ధానంగా హైలైట్.. అవేంటంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Rajeev Kanakala : కొడుకు లిప్ లాక్ గురించి మాట్లాడిన రాజీవ్.. త‌ల‌దించుకున్న సుమ‌..

by Shreyan Ch
October 11, 2023

...

Read moreDetails
politics

Janasena : జ‌న‌సేన గ్రాఫ్ పెరిగిందా.. సొంత స‌ర్వేలో ఏం తేలింది..?

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా ?

by editor
September 29, 2022

...

Read moreDetails
వార్త‌లు

Sobhan Babu : శోభ‌న్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

by Shreyan Ch
December 22, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.