Jr NTR : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఎన్టీఆర్- ప్రణతి జంట తప్పక ఉంటుంది. ఈ జంట పెద్దగా బయట కనిపించరు. ఏదో కొన్ని అకేషన్స్‌కి మాత్రమే ఎన్టీఆర్- ప్రణతి తళుక్కున మెరిసి సందడి చేస్తుంటారు. 2011 మే 5వ తేదీన లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకోగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వీరి వివాహంలో సందడిచేశారు. ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఫ్యామిలీతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అంతేకాదు తన భార్య లక్ష్మీ ప్రణతితో టైం స్పెండ్ చేయడం కోసం ఆయన ఎక్కువగా విదేశాలకు వెళ్తూ వెకేషన్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఎన్టీఆర్ ప్రణతిల వివాహం ఎంతో ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. అప్పట్లో వీరి వివాహానికి చేసిన ఖర్చు, వేసిన మండపం హాట్ టాపిక్ గా నిలిచాయి. వీరి వివాహం కోసం 160 మీటర్ల ఎత్తైన కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఈ కళ్యాణమండపానికే రూ.18 కోట్ల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ ఈ కళ్యాణ మండపానికి సంబంధించిన పనులు చూసుకున్నాడట. ఇక ఎన్టీఆర్ ప్రణతిల వివాహానికి మొత్తం 10 వేల మంది బంధుమిత్రులు, స్నేహితులు హాజరయ్యారు.
ఇక ఈ వేడుకలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదువే లేదు. టాలీవుడ్ సింగర్ గీతా మాధురి, కృష్ణ చైతన్య.. ఎన్టీఆర్ ప్రణతిల వివాహం కోసం ఓ స్పెషల్ సాంగ్ పాడారు. అతిథుల కోసం ఖరీదైన లగ్జరీ హోటల్ బుక్ చేశారు. ఇక ఎన్టీఆర్ పెళ్లి పత్రిక విషయానికి వస్తే చాలా సింపుల్‌గా సంప్రదాయబద్ధంగా ఉంది. ఇందులో ఎన్టీఆర్ పెళ్లి పత్రిక, లక్ష్మీ ప్రణతి తాతగారి పెళ్లి పత్రికలను జతచేశారు. ఈనాడు అధినేత రామోజీరావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి సీనియర్ నటులు వచ్చి ఎన్టీఆర్, ప్రణతి జంటను ఆశీర్వదించారు. అంతే కాకుండా పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సైతం హాజరై ఎన్టీఆ,ర్ ప్రణతిలకు ఆశీస్సులు అందించారు. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు ఉన్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…