Jr NTR : నందమూరి ఫ్యామిలీ హీరోలలో టాప్ హీరోలుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతుండగా, పదిహేడేళ్ల వయసులోనే నందమూరి తారకరామారావు మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు తెచ్చుకోగా, తర్వాత ఎన్టీఆర్ చేసిన ఆది, సింహాద్రి సినిమాలు అయితే ఏకంగా ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా నిలబెట్టాయ్ అని చెప్పొచ్చు. ఇక నందమూరి ఫ్యామిలీకి చెందిన మరో హీరో కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు.
ఇక వీరిద్దరి బాండింగ్ చూస్తే కొందరు ఈర్ష్యపడుతుంటారు. వీరిద్దరు గొడవ పడ్డట్టు ఎలాంటి పుకార్లు కూడా బయటకు రావు. అయితే కళ్యాణ్ రామ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో డేట్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఆదుకున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా పెద్దగా రాణించని సమయంలో నిర్మాతగా కూడా పెద్ద సక్సెలు రాలేదు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకుంటున్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్లకు ఎన్టీఆర్ హాజరవుతూ సినిమాలపై అంచనాలను పెంచుతూ అన్నకి ఎంతగానో అండగా నిలబడుతారు.
కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ త్వరలో కలిసి నటించి చూస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందులో జాన్వీ కథానాయికగా నటిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా అమిగోస్ చిత్రంతో పలకరించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…