Jonnalagadda Chaitanya : ప్యాకేజీల కోసం మెగా కుటుంబం దిగ‌జారుతుంది.. జ‌న‌సేన‌కి ఓటు వేయొద్ద‌న్న నిహారిక మాజీ భ‌ర్త‌..

Jonnalagadda Chaitanya : మెగా బ్ర‌దర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య అనే వ్య‌క్తిని వివాహం చేసుకొని ఆ త‌ర్వాత ఇద్దరి మ‌ధ్య వ‌చ్చిన మ‌నస్ప‌ర్ధ‌ల వ‌ల‌న డైవ‌ర్స్ ఇచ్చాడు. వివాహమైన తర్వాత అత్తగారింట్లో నిహారిక సర్ధుకుపోలేకపోవ‌డం, చైతన్య, నిహారిక చేత నాగబాబు వేరు కాపురం పెట్టించడం కూడా జ‌రిగింద‌ని, పెళ్లైన తర్వాత నటించే విషయంలో భర్త చైతన్యతో పాటు అత్తారింటి ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టాయని ఆక్ర‌మంలోనే ఇద్ద‌రికి విడాకులు తీసుకున్నార‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. రాజీ కోసం నాగబాబు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింద‌ని కూడా అన్నారు. తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందంటూ కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి.

అయితేవ విడాకుల త‌ర్వాత నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా బాధపడ్డానంది. తాను పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ ఎప్పుడు ఎదుటివ్యక్తిపై ఆధారపడి జీవించడం సాధ్యం కాదంది, ఇక పెళ్లితో ఓ గుణపాఠం నేర్చుకున్నానంది. అయితే నిహారిక కామెంట్స్‌పై చైతన్య కూడా స్పందించాడు. నిజం ఏంటనేది రెండువైపులా తెలుసుకోవాలి, చూపించాలి. ఒకవైపు నుంచే విని జడ్జీ చేయడం సరికాదు. విడాకులు తర్వాత కలిగే నొప్పి, బాధ గురించి, దాని నుంచి ఎలా బయటపడ్డారనే విషయంపై మాట్లాడుకుంటే బాగుంటుంది. అది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఏం తెలియకుడా ఒకవైపు నుంచి చూసి జడ్జీ చేసి కామెంట్స్‌ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫాం ఉపయోగించి ప్రజలకు ఒకవైపు నుంచే జరిగింది చెప్పడం కూడా అంతే తప్పు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దీనిపై నిహారిక స్పందించింది లేదు.

Jonnalagadda Chaitanya says not caste vote for pawan kalyan or tdp
Jonnalagadda Chaitanya

ఇక ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని గెలిపించే ప‌నిలో బిజీగా ప‌డింది. ఇప్ప‌టికే ప‌లువురు మెగా హీరోలు పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా ద్వారా త‌మ స‌పోర్ట్ అందించారు. ఇక ఇదే స‌మ‌యంలో నిహారిక మాజీ భ‌ర్త చైత‌న్య సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. స్వార్ధ రాజ‌కీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంత‌కైన తెగిస్తుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. జ‌న‌సేన సిద్ధాంతాల‌ని ప‌వ‌న్ పాటించరు. చెప్పే మాట‌ల‌కి, చేసే చేష్ట‌ల‌కి పొంత‌న ఉండదు. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ప్యాకేజీల కోసం మెగా ఫ్యామిలీ ప‌ని చేస్తుంది. ఆర్టిస్టుల‌ని అవ‌కాశాలు రావ‌ని భ‌య‌పెట్టి ప్ర‌చారం చేయిస్తున్నారు.జ‌న‌సేన‌ని న‌మ్మి చాలా మంది న‌ష్ట‌పోయారు. ఆ పార్టీకి ఎవ‌రు ఓటు వేయోద్ద‌ని చైత‌న్య అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago