Jogi Ramesh : నారా లోకేష్ యువగళం పాదయాత్రపై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. గన్నవరంలో మొరిగిన కుక్కలు అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు మొరిగినట్లు టీడీపీ నేతలు మొరుగుతున్నారు. కర్రలు తీసుకుంటే కుక్కలు పారిపోయినట్లు టీడీపీ నేతలు పారిపోతున్నారు. నేను నీ ఇంటికే వచ్చా మీ నాన్న పారిపోయాడు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. గన్నవరం సభ ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉంది. మీ అయ్యనే ఉరికించాం.. నువ్వు ఎంత లోకేష్ అని ఆయన ఫైర్ అయ్యాడు.
లోకేష్ నీ లోకేష్ నోరు అదుపులో పెట్టుకో. నీ అయ్యని ఉరికించాం. నువ్వెంత. పాదయాత్ర అంటే ఏంటో వైఎస్ఆర్, వైఎస్ జగన్‌ని చూసి నేర్చుకో. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారు. బౌన్సర్స్‌ని పెట్టుకుని చేయడం కాదు యాత్ర అంటే. పాదయాత్ర అంటే పేటెంట్ వైఎస్ఆర్, జగన్‌కు మాత్రమే ఉంది. నేను చంద్రబాబు ఇంటికే వెళ్లాను.. నువ్వు టైం చెప్పు.. ప్లేస్ చెప్పు మళ్లీ నీ దగ్గరకు వస్తాం. వారాహి యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా మీరు మళ్లీ అధికారంలోకి రారు.’’ అంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
పాదయాత్ర అంటే బౌన్సర్లను పెట్టుకుని చేయడం కాదన్నారు మంత్రి జోగి రమేష్. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ మాత్రమే పాదయాత్రకు అర్హులన్నారు. లోకేష్ తీరుపై డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్.. ప్రజల తరపున పోరాడుతున్నందుకు తనపై ఆంక్షలా అని లోకేష్ ప్రశ్నించడం పైనా ఆర్జీవీ సీరియస్ అయ్యారు. ఓవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే.. తనపై లోకేష్ చేసిన కామెంట్స్‌కు రామ్‌గోపాల్ వర్మ సైతం సమాధానం చెప్పడం చర్చనీయాంశం అయింది.