Jeevitha Rajasekhar : జీవిత-రాజశేఖర్.. టాలీవుడ్లో హిట్ పెయిర్ అని చెప్పాలి. వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో కలిసి నటించారు. వీరు నటించిన సినిమాలు కుటుంబ కథా చిత్రాలుగా కూడా పేరు తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. ఇక, మన వాళ్లకు పెద్దగా తెలియని విషయం ఏంటంటే.. వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారు. మన తెలుగు వారు మాత్రంకాదు. కానీ, జీవిత మాత్రం తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. డాక్టర్ వృతిని వీడి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన రాజశేఖర్ ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు.
1991లో నటి, దర్శకురాలు జీవితను పెళ్లి చేసుకున్నారు రాజశేఖర్. వీరికి శివాని, శివాత్మిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే రాజశేఖర్ – జీవితకు సంబంధించిన లవ్ స్టోరీ ఎప్పుడు ఎలా మొదలైందనే విషయం గురించి ఓ టాక్ షోలో జీవితనే స్వయంగా వెల్లడించింది. దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. 1987లో వచ్చిన ‘తలంబ్రాలు’ చిత్రంలోరాజశేఖర్ – జీవితా కలిసి నటించగా, ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట. పద్మాలయ స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లం. అలా దగ్గరయ్యాం. ఆసమయంలోనే రాజశేఖర్ ను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను అని జీవిత చెప్పుకొచ్చారు.
రాజశేఖర్ చాలా ఓపెన్‌గా ఉంటారు. మంచి మనిషి. ఆయన క్యారెక్టర్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సరదాగా ఉంటారు. ఆ క్వాలిటీస్ బాగా నచ్చాయి. ఇక అలా ఇద్దరం కలిసిపోయాం. కానీ అప్పటి వరకు ప్రపోజ్ చేయలేదు. ఓ రోజు తనను ఇష్టపడుతున్న విషయాన్ని తెలుసుకొని తమ ఇంట్లో అస్సలు ఒప్పుకోరని చెప్పారు. ఇంట్లో వాళ్లని ఎదురించి బయటికి రావడం తన వల్ల అయ్యే పనికాదని చెప్పారన్నారు. ఆ తర్వాత అన్ని సర్దుకున్నాయని చెప్పారు. అయితే వీరి లవ్ స్టోరీలో మొదట జీవితనే రాజశేఖర్ కు ప్రపోజ్ చేయడం ఇక్కడ గమనించదగ్గ విషయం.రాజశేఖర్ జీవితలు ఎక్కడకు వెళ్లిన కలిసి వెళతారు. ఈ జంటని చూసి చాలా మంది మురిసిపోతుంటారు కూడా.