Jeevitha Rajasekhar : టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వారిపై ఆరోపణలు చేయడం, తప్పుడు కామెంట్స్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అలాంటిది కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లోని సాధారణ పౌరులు ఇచ్చే రక్తాన్ని అమ్ముకుంటున్నారని నాడు జీవిత, రాజశేఖర్‌లు సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. వారి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు.
దీనిపై సుదీర్ఘ విచారణ జరిపి సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్, జీవితకు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరు బెయిల్ బాండ్ల రూపంలో రూ.10 చొప్పున పూచీకత్తులను సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు.అయితే ప్రస్తుతం రాజశేఖర్ దంపతులు పెద్ద చిక్కుల్లో పడడంతో తాజాగా జీవిత రాజశేఖర్ పవన్ కళ్యాణ్‌ని కలిసి క్షమించమని కోరిందట. అంతేకాదు తన బాధని చెప్పుకొని ఏడ్చేసిందట. జీవిత బాధని చూసి చలించిపోయిన పవన్ మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారట.
![Jeevitha Rajasekhar : పవన్ కళ్యాణ్‌ని కలిసి సాయం చేయమంటూ ఏడ్చేసిన జీవిత రాజశేఖర్ Jeevitha Rajasekhar asked pawan kalyan to help them](http://3.0.182.119/wp-content/uploads/2023/07/jeevitha-rajasekhar-1.jpg)
ఇక ఈ విషయం మీద గతంలో రెండు సార్లు రాజశేఖర్ కూతుర్లు వెళ్లి చిరంజీవిని రిక్వెస్ట్ చేశారంట. మా తల్లిదండ్రులు ఏదో పొరపాటున మాట్లాడారు. ప్లీజ్ వదిలేయండి అంకుల్ అంటూ అడిగారంట. ఇదే విషయాన్ని గతంలో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు బయట పెట్టారు. ఎందుకంటే ఆ సీనియర్ జర్నలిస్ట్ సాయంతోనే వారు అక్కడకు వెళ్లారంట. అప్పట్లో కాంగ్రెస్ నేతల మాటల నమ్మి రాజశేఖర్-జీవిత అలాంటి కామెంట్లు చేశారనే వాదన కూడా జరిగింది. అయితే చిరంజీవి మాత్రం ఎన్నడూ ఈ వివాదం గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు.