JD Lakshmi Narayana : మరి కొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీలో చేరికలు ఎక్కువ అవుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నాడంటూ ఇప్పుడు చర్చ జోరుగా నడుస్తుంది. మొన్నటి వరకూ ఆ మాజీ ఐపీఎస్ అధికారి ఎక్కడా ఎక్కడా అంటూ అందరూ మాట్లాడుకున్నారు. జనసేన నుంచి జంపైన తర్వాత జాడ లేదంటూ చర్చించుకున్నారు. కానీ పొలిటిక్స్ ఎప్పుడూ ఒకరకంగా ఉండవు కదా. అన్నట్టు ఆయన సేన వైపు చూస్తున్నారట. సేనానితో కలవాలని అనుకుంటున్నారన్న పుకార్లు రెక్కలు కట్టుకుని ఊరేగుతున్నాయి. సేనానితో సరిపడదని బయటకు వచ్చిన ఆ డైనమిక్ మాజీ ఐపీఎస్ మళ్లీ ఆ సైనికుల్లో తానూ ఒకడిగా ఉంటానంటూ ముందుకొస్తున్నారని అన్నారు.
తాజా ఇంటర్వ్యూలో జేడీ తను ఏ పార్టీలో చేరబోతున్నాడనే విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నా కోర్ టీంతో చర్చిస్తున్నాను.రానున్న రోజులో దానిపై క్లారిటీ ఇస్తాను. మంచి రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నాను. రాజకీయాలు ఎలా ఉండాలి అంటే ప్రతిపక్షంలో మంచి వ్యక్తి ఉంటే అతనిని తీసుకొచ్చి మనం మంత్రిని చేయాలి. పీవీ నరసింహారావు, అటల్ బిహారి వాజ్‌పేయ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. పక్క రాష్ట్రంలో స్టాలిన్ బ్యాగులపై జయలలిత బొమ్మలని ఉంచమని చెప్పాడు. అమ్మ క్యాంటీన్స్ కంటిన్యూ చేయమని చెప్పాడు. అలాంటి రాజకీయాలు మనకి కావాలని అన్నాడు. త్వరలోనే జేడీ ఏ పార్టీలో చేరబోతాడు అనే దానిపై అయితే ఓ క్లారిటీ ఇవ్వనున్నాడు.
![JD Lakshmi Narayana : జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ జనసేనలోకి వెళుతున్నాడా.. ఆయన మాటల్లో అర్ధం ఏంటి? JD Lakshmi Narayana reportedly coming back to janasena](http://18.142.245.102/wp-content/uploads/2023/08/jd-lakshmi-narayana.jpg)
చాలా మంది జేడీ తిరిగి జనసేనలోకి వెళతారని అంటున్నారు. పవన్ అంత మాస్ ఇమేజ్ లేకపోయినా, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా జేడీ లక్ష్మీనారాయణకూ ఎంతోకొంత పాపులారిటీ ఉంది. అందుకే ఇద్దరూ కలిస్తే, ఏపీ అంతా జనసేన కెరటాలు ఎగసిపడతాయని అనుకున్నారు. విశాఖలో ఎంపీగా ఓడిపోయినా, భారీ ఓట్లతో ఓటర్ల హృదయాలను గెలుచుకున్న లీడర్‌గా జేడీకి పేరొచ్చింది. కానీ అప్పుడప్పుడే గట్టి పునాదులు వేసుకుంటున్న జనసేనలో అధినేతకు, ఈ ఆఫీసర్‌కు మధ్య ఎందుకోగానీ లుకలుకలు పెరిగాయి. జనసేనలో తాను ఒంటిరి అవుతున్నాన్న ఫీలింగ్‌తో పాటు, తనకు ముందో మాట చెప్పి తర్వాత మాట మార్చారంటూ పవన్ సినిమా షూటింగ్‌ల విషయమొకటి తెరపైకి తెచ్చి జనసేనకు బై బై చెప్పేశారు.