JD Chakravarthy : సుడిగాలి సుధీర్ ఎంత మంచివాడంటే.. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన జేడీ..

JD Chakravarthy : సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. నాకు మంచి పాత్రను, సవాల్‌తో కూడుకున్న పాత్రను ఇచ్చిన అరుణ్ గారికి థాంక్స్. నాలోని ఇంకో కోణాన్ని చూపించే పాత్ర వచ్చింది. డాలీషాతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆమె నటిస్తూ ఉంటే ఎంతో కాంపిటేటివ్‌గా అనిపిస్తుంది.

మా సినిమాను ఎలా ప్రమోట్ చేయాలా? అనుకుంటున్న టైంలోనే బెక్కెం వేణుగోపాల్ గారు సాయం చేశారు. మంచి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేలా హెల్ప్ చేశారు. గెటప్ శ్రీను అనే వాడు.. వేణు అన్న దగ్గరికి వెళ్లమని చెప్పకపోతే.. మల్లెమాల టీం, జబర్దస్త్ లేకపోతే.. మీ అభిమానం నాకు దక్కేది కాదు. వాళ్ల వల్లే మీ అభిమానం దొరికింది. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేను. గాలోడు సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది.. ఇప్పుడు మంచి చిత్రాలు ఇస్తే ఇంకా ప్రేమిస్తారు అని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారు. ఇకపై కొత్త కంటెంట్, మంచి సినిమాలు తీస్తాను. కొత్త సినిమా, కొత్త ప్రయత్నం చేశాం. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. 30వ తేదీ అందరూ ఓటు వేయండి.. 1వ తేదీ మా సినిమాను చూడండి’ అని అన్నారు.

JD Chakravarthy sensational comments on sudigali sudheer
JD Chakravarthy

సుధీర్ చాలా మొహమాటస్తుడు. చాలా మంచి వ్యక్తి. అరుణ్ విక్కిరాల చాలా పర్‌ఫెక్షనిస్ట్. చాలా డెడికేటెడ్ పర్సన్. ఆల్రెడీ గ్లింప్స్‌లో డాలీషాను చూశాను అద్భుతంగా అనిపించింది. అరుణ్ పర్‌ఫెక్షన్‌కు అమ్మాయిలు ఉండరు. కానీ సినిమాలు ఉంటాయి . డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాను అందరూ వీక్షించండని జేడీ చక్ర‌వ‌ర్తి అన్నారు. సుధీర్ గురించి మాత్రం ఆయ‌న గొప్ప‌గా చెబుతూ ప్ర‌శంస‌లు కురిపించాడు.సుధీర్‌ని చాలా మంచి న‌టుడు అని అన్నా కూడా మొహ‌మాట‌ప‌డ్డాడు. అంత మంచి న‌టుడు సుధీర్ అని జేడీ ప్ర‌శంస‌లు కురిపించాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago