Jayasudha : జయసుధ సినిమాలలలో కథాయినకగా ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆమె సినిమాలలో ఏదో ఒక పాత్రతో సందడి చేస్తూనే ఉంది. ఇక రాజకీయాలలోను తన సత్తా చాటాలని భావిస్తుంది. ఒకప్పుడు టిడిపిలో ఉన్న సహజ నటి..మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసిపి లో చేరా రు. వైసిపి అధినేత జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు జయసుధ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తుతానికి ఎన్ని కలలో పోటీ చేసే ఆలోచన లేదు. అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటా. వైఎస్సార్ సీపీలో చేరడంతో మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని తెలిపారు.
జయసుధ 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొం దారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. జయసుధ ఆ తర్వాత 2016 లో టీడీపీలో చేరినా…క్రియా శీలకంగా లేరు. జయసుధ వాస్తవానికి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన నేత. వైసిపి లో ఇంత సడన్ గా చేరటం అందరిని ఆశ్చర్యపరచింది. అప్పుడు పవన్ కళ్యాణ్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అతడిని నమ్మోద్దు.. పచ్చి అబద్దాలు కోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు పవన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం ఆసక్తిని రేపుతుంది.
పవన్ మనసులో ఒక మాట బయటకు ఒక మాట మాట్లాడే మాట కాదని జయసుధ పేర్కొంది.ఆయనను ప్రజానాయకుడిగా పరిగణించి అందరు అతనిని గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కి డబ్బు ప్రధానం అంటే ఆయన సినిమాలలో సినిమా చేసి ఉంటే బాగా డబ్బు సంపాదించి ఉండేవాడు. కాని అవన్నీ పక్కన పెట్టి ప్రజలలోకి వచ్చాడు. అతడిని గెలిపించాలని జయసుధ కోరింది.అయితే పవన్ రాజకీయాలలోకి వచ్చే సమయంలో మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా వచ్చి సమాజానికి సేవ చేయవచ్చు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక మంచి లీడర్ అవుతారని అనుకుంటున్నాను అని జయసుధ అన్నారు.