Jayasudha : ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తుంది.ముఖ్యంగా ఏపీలో అయితే రాజకీయం రంజుగా సాగుతుంది. ఇక తెలంగాణలో కూడా బీజేపీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది.ఇప్పటికే పలువురు ప్రముఖులని బిజేపీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. దీంతో రాష్ట్రంలోని పార్టీలు అన్నీ చేరికలపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ .. బీజేపీలో చేరింది. కాగా, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ టికెట్ పై 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ అనేక ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఎన్టీఆర్ తర్వాత చాలా మంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి వచ్చారు. ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అని జయసుధని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారని మీకు నమ్మకం ఉందా అంటే.. తన మనసులో ఏముందో తప్పక సాధించే కసి ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ అని జయసుధ పేర్కొన్నారు.20 రోజులలో జయసుధ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ని ఎందుకు చేయలేకపోయారు అనగా, అది ప్రజలే నిర్ణయించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. తాను తప్పని పరిస్థితులలో పార్టీ మారాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇక విజయశాంతితో కలిసి తాను పని చేస్తానని జయసుధ పేర్కొంది. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్టు జయసుధ చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేస్తానని తెలిపారు. పార్టీ ద్వారా క్రైస్తవుల కోసం పని చేస్తాని స్పష్టం చేశారు. క్రైస్తవుల ప్రతినిధిగా తన స్వరాన్ని వినిపిస్తానని జయసుధ పేర్కొన్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటూ వార్తలపై స్పందించిన జయసుధ.. అవన్ని రూమర్లు మాత్రమేనని కొట్టిపారేశారు. వ్యక్తిగత విమర్శలపై కాకుండా నిర్మాణాత్మక విమర్శలతో ముందుకు వెళతానని ఆమె చెప్పుకొచ్చార. మోదీ విధాానాలు నచ్చే తను బిజేపీలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. విజయశాంతితో తనకు మంచి సంబంధాలు తనకి ఉన్నాయని స్పష్టం చేసింది.