Jayaprakash Narayana : కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌పై జేపీ సంచ‌ల‌న‌ కామెంట్స్.. ఇది వింటే గుండె ప‌గిలిపోతుంది..!

Jayaprakash Narayana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్‌ను కేసీఆర్‌కి ఇస్తూ రెండు సార్లు గెలిపించారు. కొద్ది నెలల క్రితం జరిగిన మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు, అలాంటి స్థితి నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు కాంగ్రెస్ పుంజుకున్న తీరు అత్యద్భుతం. ప్రజల్లో అసంతృప్తి ఉన్న అంశాలను గమనించి వాటి ఆధారంగా హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకుంది. ప్రతినెల మహిళలకు రూ.2500, రూ.500 కే వంట గ్యాస్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైనవి మహిళలను ఆకట్టుకున్నాయి.

అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై జేపీ ఆస‌క్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలే అంత బాగోలేవ‌ని గ‌తంలో చెప్పాను. వాటిని మించి కాంగ్రెస్ వారు హామీలు ఇచ్చారు. దీని వ‌ల‌న కొన్ని ల‌క్ష‌ల కోట్ల భారం పడే అవ‌కాశం ఉంది. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బంతా తాత్కాలిక తాయిలాలకు, ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానానికి ఖర్చు చేసి భవిష్యత్తును నాశనం చేస్తుందో గమనించాలని జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. మనం కనుక మళ్లీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)కు మళ్లితే మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టేనని, అది జీవన్మరణ సమస్య అవుతుందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఆలోచించకుండా హామీ ఇస్తే దానిని వెనక్కి తీసుకోవడమో, మధ్యేమార్గాన్ని అన్వేషించడమో చేయాలని సూచించారు. కడుతున్న పన్నులు ఎటుపోతున్నాయో సామాన్యులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

Jayaprakash Narayana sensational comments on congress promises
Jayaprakash Narayana

తప్పుడు హామీలు ఇచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ఇక్కడ హామీలు ముఖ్యం కాదని.. దేశం, పిల్లల భవిష్యత్తు ముఖ్యమని అన్నారు. ఎవరు ఏమైపోతేనేం నా హామీలు నాకు ముఖ్యమనుకుంటే దేశం నాశనం అయిపోతుందని హెచ్చరించారు. పోరాటం అనేది ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది కోసమా? పన్నులు కట్టే ప్రజల కోసమా? అనేది ఆలోచించాలని జేపీ సూచించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో హామీల అమ లుకు రూ.3.50 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.77 లక్షల కోట్లు మాత్రమే. మరి కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలంటే అదనంగా మరో రూ.80వేల కోట్లు కావాలి. వీటికి అదనంగా ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ ఖ ర్చులు తదితర వాటిని లెక్కిస్తే మొత్తంగా మ రో రూ.2 లక్షల కోట్ల వరకు అప్పులు చేయా ల్సి ఉంటుందని చెప్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago