Jayaprakash Narayana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్‌ను కేసీఆర్‌కి ఇస్తూ రెండు సార్లు గెలిపించారు. కొద్ది నెలల క్రితం జరిగిన మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు, అలాంటి స్థితి నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు కాంగ్రెస్ పుంజుకున్న తీరు అత్యద్భుతం. ప్రజల్లో అసంతృప్తి ఉన్న అంశాలను గమనించి వాటి ఆధారంగా హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకుంది. ప్రతినెల మహిళలకు రూ.2500, రూ.500 కే వంట గ్యాస్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైనవి మహిళలను ఆకట్టుకున్నాయి.
అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై జేపీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలే అంత బాగోలేవని గతంలో చెప్పాను. వాటిని మించి కాంగ్రెస్ వారు హామీలు ఇచ్చారు. దీని వలన కొన్ని లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బంతా తాత్కాలిక తాయిలాలకు, ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానానికి ఖర్చు చేసి భవిష్యత్తును నాశనం చేస్తుందో గమనించాలని జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. మనం కనుక మళ్లీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)కు మళ్లితే మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టేనని, అది జీవన్మరణ సమస్య అవుతుందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఆలోచించకుండా హామీ ఇస్తే దానిని వెనక్కి తీసుకోవడమో, మధ్యేమార్గాన్ని అన్వేషించడమో చేయాలని సూచించారు. కడుతున్న పన్నులు ఎటుపోతున్నాయో సామాన్యులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

తప్పుడు హామీలు ఇచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ఇక్కడ హామీలు ముఖ్యం కాదని.. దేశం, పిల్లల భవిష్యత్తు ముఖ్యమని అన్నారు. ఎవరు ఏమైపోతేనేం నా హామీలు నాకు ముఖ్యమనుకుంటే దేశం నాశనం అయిపోతుందని హెచ్చరించారు. పోరాటం అనేది ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది కోసమా? పన్నులు కట్టే ప్రజల కోసమా? అనేది ఆలోచించాలని జేపీ సూచించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల అమ లుకు రూ.3.50 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు మాత్రమే. మరి కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటే అదనంగా మరో రూ.80వేల కోట్లు కావాలి. వీటికి అదనంగా ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ ఖ ర్చులు తదితర వాటిని లెక్కిస్తే మొత్తంగా మ రో రూ.2 లక్షల కోట్ల వరకు అప్పులు చేయా ల్సి ఉంటుందని చెప్తున్నారు.