Jayaprakash Narayana : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలలో అనేక మార్పులు జరుగుతున్నాయి. వైసీపీలో అనేక చేరికలు కూడా సాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ సభలో జయప్రకాశ్ నారాయణ సీఎం జగన్‌ని ప్రత్యేకంగా కలిసారు. ఇద్దరు పక్కన పక్కన కూర్చొని కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఈ నేపథ్యంలో జయప్రకాశ్ నారాయణ వైసీపీలోకి వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకి షాకిచ్చేలా ఆయనని విజయవాడ వైసీపీ ఎంపీగా నిలబెట్టనున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
గతంలో జగన్ సర్కారుపై లోక్ సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు గుప్పించారు. విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ఆయన అభినందించారు. పేద ప్రజల సంక్షేమానికి కచ్చితంగా డబ్బు ఖర్చుపెట్టాలన్న జేపీ.. తెలుగు రాష్ట్రాల్లో సమర్థంగా నగదు పంపిణీ చేస్తున్నారన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల అవసరం లేకుండా చివరి గడపకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ విషయమై మనం గర్వపడాలన్నారు.
![Jayaprakash Narayana : చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకి భారీ షాక్.. విజయవాడ వైసీపీ ఎంపీగా జేపీ..? Jayaprakash Narayana may contest as mp from ysrcp](http://3.0.182.119/wp-content/uploads/2023/08/jayaprakash-narayana.jpg)
ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి. వాటికి బానిసలైతే ఎలా అని జేపీ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర కాస్త బాగున్నాయన్న జేపీ.. మనకంటే బీద రాష్ట్రమైన ఒడిశా కూడా బాగుందన్నారు. ఒకప్పుడు బాగా వెనుకబడిన రాష్ట్రమైన ఒడిశా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోందన్నారు. ఆ రాష్ట్రం పాటి మనం చేయలేమా? అని జేపీ ప్రశ్నించారు. డబ్బున్న రాష్ట్రమా, బీద రాష్ట్రమా అనేది కాదు.. నాయకత్వానికి, పరిపాలనా యంత్రాంగానికి, ప్రజలకు చిత్తశుద్ధి ఉండాలి. రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేస్తే ఆ సమాజం నష్టపోతుంది. ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నేర్చుకుందాం అని జేపీ అన్నారు.