Jayaprada : ఏపీలో ఎన్నికల సందడి పీక్స్‌లో ఉంది. ఒకరిని మించి మరొకరు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేస్తానని ప్రకటించారు సీనియర్ హీరోయిన్ జయప్రద. చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఒక్కసారిగా జయప్రద వార్తల్లో నిలిచారు. పుట్టినరోజు కావటంతో జయప్రద తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు . ఈ సందర్భంగా ఆమె ఏపీ రాజకీయాల గురించి స్పందించారు. జయప్రద ఏటా తన పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ క్రమంలోనే బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు జయప్రదం. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నానన్న జయప్రద.. ఏపీలో అవకాశం ఇస్తే పోటీచేస్తానన్నారు. ఎక్కడున్నా కూడా తాను మాత్రం ఆంధ్రాబిడ్డనేనని చెప్పుకొచ్చారు,
ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఇక్కడ అవకాశం వస్తే కచ్చితంగా పోటీచేస్తా. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం మేరకు నడుచుకుంటా . ఏపీలో ఎవరైతే రాజధాని తీసుకు రాగలరో, ఎవరైతే యువకులకు ఉద్యోగం., మహిళలకు రక్షణ కల్పించగలరో వారే అధికారంలోకి రావాలనేది నా కోరిక. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా” అని జయప్రద చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నేను ఉత్తర ప్రదేశ్ లో ఉంటున్నా… ఎప్పటికీ తెలుగు బిడ్డనే.ఇక్కడ ఎన్నికలలో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది.
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా , రాజధాని లేవు. వాటికోసం పోరాడతాను.ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో.. శాశ్వత రాజధాని కడతారో వారికే నా మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అని జయప్రద చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో ప్రచారానికి పిలిస్తేనే వెళ్తానని..పిలవని పేరంటానికి వెళ్లనని ఈ సీనియర్ నటి స్పష్టం చేశారు.. ఏపీకి రాజధాని, స్పెషల్ స్టేటస్ లేవు. ఇక్కడి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరుతున్నా” అని జయప్రద అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…