Jani Master : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం రంగంలోకి జానీ మాస్ట‌ర్.. పంచ్‌ల‌తో ఒక్కొక్క‌డికి ఇచ్చి ప‌డేశాడు..!

Jani Master : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం రంజుగా సాగుతుంది. ప‌వన్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి రావ‌డంతో ఆయ‌న‌కి మ‌ద్దతుగా ప‌లువురు ప్ర‌ముఖులు కూడా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నెల్లూరులో అంగన్వాడి కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు జానీ మాస్టర్ మద్దతు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తల డిమాండ్‌లో న్యాయం ఉందని.. వారి డిమాండ్‌ను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని జానీ మాస్టర్ అన్నారు. తాను కూడా అంగన్వాడి కేంద్రానికి వెళ్లినవాడినేనని.. వారి కష్టం తనకు తెలుసని చెప్పారు . నేను నెల్లూరు నుంచి వచ్చిన వాడిని. అంగన్వాడీ కేంద్రంలో కూడా నేను తిన్న వాడిని, చదివిన వాడిని. బిషప్ శౌరి హై స్కూల్లో చదివాను. నేను పుట్టింది పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ రకరకాల వృత్తుల వారు ఉన్నారు.

వాళ్ళందరి గురించి నాకు తెలుసు. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు, వాళ్లను అంగన్వాడి కార్యకర్తలు ఎంత బాగా చూసుకుంటారు అనే విషయాలు నాకు తెలుసు. ఇంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి ఇన్నాళ్లుగా సమ్మె చేస్తున్న అది ముందుకు వెళ్లకపోవడం చూసి చాలా బాధపడ్డాను. నా వల్ల ఏమైనా అవుతుందేమో అని నా మాట సాయం వాళ్లకు పనికొస్తుందేమో అని వచ్చాను, నా మద్దతు తెలియజేశాను అని జానీ మాస్టర్ వెల్లడించారు. ఆ తర్వాత రిపోర్టర్స్ అడిగిన పలు ప్రశ్నలకు జానీ మాస్టర్ సమాధానం చెప్పారు. 2024 ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేస్తారా అని అడగగా.. తెలియదు సార్ నుదిటి మీద ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మద్దతు ఏ పార్టీకి ఇస్తున్నారు అని మరో రిపోర్టర్ అడగగా.. మద్దతు గురించి నేను ఇంకా ఏమీ అనుకోలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు.

Jani Master given support to pawan kalyan
Jani Master

మీరు జనసేన తరపున వచ్చారని అందరూ అంటున్నారు..మీరేమంటారు అని ప్రశ్నించగా… నేను మళ్ళీ చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి. రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే అంత ఇష్టం. ముందు ముందు ఏం జరుగుతుందో నేను తర్వాత చెప్తాను అని వెల్లడించారు. అంగన్వాడి కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారా అని అడగగా..వాళ్ళు డిమాండ్ చేసేది వాళ్ళ హక్కు. అంత పెద్ద బాధ్యత నెత్తిన వేసుకొని ఇంటింటికి వెళ్లి పిల్లలని చూసుకోవడం అనేది పెద్ద బాధ్యత. వాళ్ళకు ఫోన్లు ఇస్తున్నారు. వాటికి సిగ్నల్ ఉండదు. అప్పటికప్పుడు ఫోటోలు పెట్టమంటారు. వీళ్ళు ట్రై చేస్తారు కానీ సిగ్నల్ దొరకదు. దానికి మీరు పని చేయట్లేదు అని ఉన్నతాధికారులు అంటారు అని జానీ మాస్టర్ వివరించారు. అయితే అంగన్వాడి కార్యకర్తల సమ్మెకు మద్దతు ఇవ్వడానికి జానీ మాస్టర్ జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లడం గమనార్హం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago