Janhvi Kapoor : శ్రీదేవి, జాన్వీ కపూర్ ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు సినిమాలతో పాటు తన అందచందాలతో తెగ అలరిస్తుంది. స్టార్ హీరోయిన్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నా ఇంకా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళలేదు జాన్వీ. కమర్షియాలు సినిమాలు ఆఫర్ చేసినా నో చెప్తూ వస్తుంది జాన్వీ. త్వరలో మిలి అనే సినిమాతో జాన్వీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. జాన్వీ ప్రస్తుతం మిలీ ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా, ఈ క్రమంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మా అమ్మ బ్రతికున్నప్పుడు నన్ను హీరోయిన్ గా చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ అది జరగలేదు . అయితే ఇప్పుడు ఆమె లేని లోటు నాకు బాగా తెలుస్తుంది . ఆమె కన్న కలని తప్పక నిజం చేస్తాను అని చెప్పిన జాన్వీ.. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే డైరెక్షన్లో నటించాలి అన్నది తన తల్లి కోరిక అని, అది కూడా చూడకుండా ఆమె వెళ్లిపోయిందని పేర్కొంది. అమ్మ కోరికలని తాను కచ్చితంగా తీరుస్తా… అంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్.
![Janhvi Kapoor : తల్లి చివరి కోరిక తప్పక తీరుస్తానంటున్న జాన్వీ కపూర్..! Janhvi Kapoor says she will definitely fulfil her mother wish](http://3.0.182.119/wp-content/uploads/2022/10/janhvi-kapoor.jpg)
నాది సినిమా ఫ్యామిలీ అయినంత మాత్రాన నాకు అవకాశాలు రావు. మహా అయితే ఒకటి లేదా రెండు అవకాశాలు మాత్రమే ఇస్తారు. స్టార్ డాటర్ అని చెప్పి నా మీద కోట్లు పెట్టి ఎవరు నష్టపోతారు. ఆ నష్టాలూ భరించేంత ధనవంతులం కూడా కాదు మేము. సినిమాల్లో ఊరికే డబ్బులు పెట్టి పోగొట్టుకునేంత ధనవంతులం కాదు నేను, మా నాన్న. నా టాలెంట్ మీద ఉన్న నమ్మకంతోనే సినిమా ఆఫర్స్ వస్తున్నాయి అని జాన్వీ పేర్కొంది. జాన్వీ ఇప్పటికే మంచి పేరు ప్రఖ్యాతలు అందుకోగా, త్వరలో ఆమె చెల్లి కూడా హీరోయిన్‌గా పలకరించనుంది.