Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ధడఖ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ సినిమాల కన్నా కూడా తన గ్లామర్ షోతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. కేక పెట్టించే అందం ఈ అమ్మడి సొంతం. మత్తెక్కించే అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది జాన్వీ కపూర్. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫులో జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రెచ్చిపోతుంది. ప్రస్తుతం ఈముద్దుగుమ్మ జూ.ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా జాన్వీ లుక్‌ని చూసిన కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.
ధడక్ సినిమాతో 2018లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ధడక్ చిత్రం తర్వాత ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బావాల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం దేవరలో నటిస్తోంది. మొదటి సినిమాలోనే స్టార్ హీరోతో నటించబోతున్న ఈమెకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇటీవల జాన్వీకపూర్ డేటింగ్ పై వస్తున్న వార్తలు బీ టౌన్ లో హాట్ టాపిక్‌గా మారాయి. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా తో డేటింగ్ లో వున్నట్లు చాలా రోజులు గా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ జంట తరచూ పార్టీలు, ఫంక్షన్స్ లో దర్శనమిస్తున్న ఫోటోలు ఇదివరకే వైరల్ అయ్యాయి. తాజాగా వీరి ఇన్స్టాగ్రామ్ చాట్ డేటింగ్ రూమర్స్‌కు మళ్ళీ బలాన్ని ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకతను.. ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో శిఖర్ పింక్ డ్రెస్ వేసుకున్న ఓ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన జాన్వీ.. ‘ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఎవరు’ అని కామెంట్ చేసింది. దీనికి బదులుగా ‘నేను నీ వాడినే’ అని అర్ధం వచ్చేలా బదులు ఇచ్చాడు శిఖర్. అయితే వెంటనే ఆ కామెంట్స్ డిలీట్ కూడా చేశారు.ఇది చూసిన వారికి వీరి మధ్య వున్న బాండింగ్ ని మరింతగా బలపరిచింది.