Janasena Leaders : ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ పొత్తుపై మాట్లాడకుండా కలిసి పనిచేద్దామని మాత్రమే చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పుడు కలిసి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు బలమైన మద్దతుదారుగా మారిన పవన్..ఇప్పుడు వైసీపీపై పోరులో భాగంగా టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయని అందరిలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఏనాటికైనా సీఎం అవుతారని ఆశగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు, కాపు సామాజిక వర్గ ప్రజలు ఓవైపు.. మరోవైపు అధికారం కావాలంటే ఓ అడుగు వెనక్కి తగ్గక పరిస్ధితుల్లో ఉన్న చంద్రబాబు, టీడీపీ. అదే సమయంలో జరిగిన చంద్రబాబు అరెస్టు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించేసింది.
పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాక వైసీపీ నాయకులు విరుచుకు పడుతుండగా, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మిక్స్డ్ రెస్పాన్స్ ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం వలన ఏపీ చాలా వెనక పడింది. ఇప్పుడు ఈ ఇద్దరు కలవడం వలన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్టే . ఎక్కడ ఓట్లు చీలిపోతాయని అనుకున్నాం. కాని వారి నిర్ణయం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని జనసేన పార్టీ నాయకులు అంటున్నారు.
ఇక పవన్ ప్రకటనపై ఏపీ బీజేపీ ఆచితూచి స్పందించింది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని, మిగతా పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలు స్థానికంగా నిర్ణయించవచ్చని జాతీయ పార్టీల నిర్ణయం ఢిల్లీ నుంచే రావాలని ఏపీ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ది రాష్ట్ర స్థాయిలో తేల్చే వ్యవహారం కాదని.. ప్రస్తుతానికి జనసేనతో స్నేహబంధం కొనసాగుతుందన్నారు. పొత్తులు, మార్పులు ఉంటే అధిష్టానమే చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని, బీజేపీ కూడా కలిసివస్తుందన్న పవన్ కళ్యాణ్ ప్రకటనను ఏపీ బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి స్వాగతించారు.