Jagan And Bharati : వినూత్న పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ ఏపీ ప్రజల మనసులు దోచుకున్నారు వైఎస్ జగన్. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకి సేవ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర ద్వారా జనాలకి చాలా దగ్గరైన జగన్ ముఖ్యమంత్రిగాను ప్రజల బాగోగుల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో జగన్‌కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రీసెంట్‌గా జగన్, ఆయన సతీమణి భారతి ఓ వివాహ వేడుకకి హాజరు కాగా, ఆ వివాహ వేడుకలో వీరిద్దరే సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు. జగన్‌ని తమ కెమెరాలలో బంధించేందుకు పోటీపడ్డారు. ఇక భారతితో కూడా కొందరు మహిళలు ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం అయితే వారి క్రేజ్ కి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతీరెడ్డి దంపతులకు వివాహమై 26 ఏళ్లు అవుతుంది. ఆగస్ట్ 28న వారి వివాహ వార్షికోత్సవం కాగా, ఈ సెలబ్రేషన్స్ కోసం వారు విదేశాలకి వెళ్లబోతున్నారని సమాచారం. కడప జిల్లా పులివెందులలోని వైఎస్‌ఆర్ఆర్ లయోలా డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఆగస్టు 28, 1996 ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్-భారతి వివాహం ఘనంగా జరిగింది. ఇదే ముహూర్తానికి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వివాహం కూడా జరగడం విశేషం.
వైఎస్ జగన్ వివాహం నాటికి ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కడప ఎంపీగా ఉన్నారు. వైఎస్ భారతిది పులివెందులకు చెందిన స్వర్గీయ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె. 24 ఏళ్ల వయస్సుకే వివాహం చేసుకున్న జగన్‌మోహన్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. గతేడాది 25వ వివాహ వార్షికోత్సవాన్ని వేడుకగా జరుపుకున్న ముఖ్యమంత్రి దంపతులు.. ఈ ఏడాది కూడా వారి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోనున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు జగన్ అభిమానులు సోషల్ మీడియాలో పాత ఫొటోలను ఇప్పటి నుండే వైరల్ కూడా చేస్తున్నారు. ఇక మరి కొద్ది రోజులలో ఏపీ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో జనగ్ కూడా పక్కా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.