Jabardasth Prasad : బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్నిచ్చింది. ఈ స్టేజీపై నవ్వులు పూయించిన వారు ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలోనే కొనసాగుతూ వస్తున్నారు. కొందరు మాత్రం తమ బాధలను దిగమింగి, ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు.
కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్‌లో వాడి అందరిని నవ్వించాడు. ఎప్పుడు ఏ షోలో కనిపించినా ఫుల్ కామెడీ చేస్తూ కడుబ్బా నవ్వించే ప్రసాద్‌ను గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్ ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో ఉన్నాడు. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్‌లో కమెడియన్ జోడీ నూకరాజు ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ప్రసాద్ రెండు కాళ్ళు తీవ్రంగా వాచిపోవడంతో పాటు భరించలేని నొప్పితో నరకం చూస్తున్నాడు. ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న ప్రసాద్ ను చూస్తే కన్నీళ్లు ఆగడం కష్టమనే చెప్పాలి. కదిలినా, మెదిలినా విపరీతంగా పెయిన్ వస్తుండటం బాధాకరం. దీంతో ఆయన భార్యే ప్రసాద్ ను దగ్గరుండి చూసుకుంటుంది. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో ఆర్థికసాయం కోరుతున్నారు. ఈ కష్టకాలంలో అందరి మద్దతు కావాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ప్రసాద్ కు తగిన విధంగా సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.