Jabardasth Mahesh : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సెట్‌లో ఉంటే.. అందరికీ ఆరోజు కడుపు నిండిపోవాల్సిందే. బాహుబలి సినిమాలో నటించడమే కాదు.. ఆ మంచి మనసు ప్రభాస్‌లో ఉంది. పేరుకే రాజు కాకుండా.. నిజంగానే రాజు అని నిరూపించుకున్నాడు ప్రభాస్. అందరి కడుపు నింపాలని ఎప్పుడూ పరితపిస్తుంటాడు. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు పెద్దకర్మకు వచ్చిన అభిమానుల అందరి కడుపునింపి అందరిని ఆశ్చర్యపరిచాడు. కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. అప్పట్లో ఈ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రభాస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అతను తన ఇంటికి వచ్చిన గెస్టులను ఎలా చూసుకుంటారో అందరికీ తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే కనీసం 30 రకాల వంటలు ఉంటాయి. ప్రభాస్ ఆతిథ్యం మరిచిపోలేనిది. ప్రభాస్ డబ్బు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్ ను చూస్తే తెలుస్తుంది’ అని ఒకానొక సందర్భంలో తమన్నా చెప్పుకొచ్చింది. అయితే జబర్ధస్త్ నటుడు మహేష్ తాజాగా ప్రభాస్‌తో జరిగిన కొన్ని సంఘటనలు గురించి చెప్పారు.
![Jabardasth Mahesh : ప్రభాస్ ఇంటి నుంచి ఎంత మందికి ఫుడ్ బయటకు వెళ్తుందో తెలుసా..? Jabardasth Mahesh interesting comments on prabhas](http://3.0.182.119/wp-content/uploads/2023/05/jabardasth-mahesh-prabas.jpg)
మారుతితో సినిమా గురించి మాట్లాడుతూ ‘మాట ఇచ్చాక నిలబెట్టుకోవడమే ప్రభాస్ గొప్పతనం’అని అన్నారు. మారుతి సినిమాలో ఆయన అన్ స్టాపబుల్ షోలో కనిపించినట్లుగా ఉంటారన్నారు. ఇక షూటింగ్ సమయంలో ఆయన తెప్పించిన ఫుడ్ గురించి చెప్పారు మహేష్. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..తాను చూశానంటూ ఎగ్జైట్ అయ్యారు. ‘షూటింగ్ సమయంలో ..200, 300 మందికి ఫుడ్ తెప్పించారు. అందరూ కుమ్మేసాం. నేను మటన్ బాగా తిన్నాను. నాకు నచ్చింది మటన్ అని అనగానే మటన్ అన్నా అనగానే..మళ్లీ రేపొద్దున మహేష్‌కు మటన్ తెప్పించండి అన్నారు. ఆయనే ఇంటి నుండి వండించి, పంపించారు. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..ఆ రోజు చూశాను. నెక్ట్ లెవల్ అంతే అంటూ జబర్ధస్త్ మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.