Jabardasth Judge : బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయిస్తున్న సూపర్ కామెడీ షో జబర్దస్త్ . ఈ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది కమెడియన్లకు జీవితాన్ని ఇచ్చిన ఈ షో సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. కమెడియన్లు ఎంతో మంది వచ్చి పోతున్నా.. జడ్జిలుగా నాగబాబు, రోజా ముందుండి షోను ముందుకు సాగించారు. అయితే నిర్వాహకులతో విభేదాల కారణంతో నాగబాబు.. మంత్రి పది రావడంతో రోజా ఈ షోను వీడారు. నాగబాబు స్థానంలో ఎంతోమందిని ట్రై చేసినా ఎవరు పెద్దగా సెట్ కాలేదు అని చెప్పాలి. కొంతకాలం సింగర్ మనో జడ్జిగా బాగానే ఆకట్టుకున్నారు.
తర్వాత ఏమైందో ఏమో గానీ.. మళ్లీ కొత్త వాళ్లను ట్రై చేస్తున్నారు. ఇటీవలె కొన్ని ఎపిసోడ్లకు నటి కుష్బూ కూడా వచ్చి సందడి చేశారు. రోజా స్థానంలో మాత్రం ఇంద్రజ కంటిన్యూ అవుతున్నారు.మరో వైపు నాగబాబు స్థానంలో యాక్టర్ కృష్ణభగవాన్ కొత్త జడ్జిగా తీసుకువచ్చారు. ఆయన రాకతోనే తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ముందుగా శివపుత్రుడు మూవీ స్పూఫ్ స్కిట్‌ను వెంకీ మంకీస్, తాగుబోతు రమేష్ చేశారు. ఈ స్కిట్‌పై ఇంద్రజ కామెంట్ చెబుతుండగా.. ఈవిడ స్కిట్ కన్నా జడ్జిమెంట్ ఎక్కువగా చెబుతున్నారంటూ పంచ్ డైలాగ్‌తో కృష్ణ భగవాన్ అందరినీ నవ్వించారు. ఆ తరువాత గజదొంగ స్కిట్‌లో రాకెట్ రాఘవ సూపర్‌గా కామెడీ జనరేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన జడ్జిగా ఫిక్స్ అయ్యాడనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ జడ్జిగా హీరోయిన్ సదా ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు. నటుడు కృష్ణ భగవాన్ తో పాటు జబర్దస్త్ జడ్జి సీటును సదా పంచుకోగా, ఈ అమ్మడు . ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా కనిపించారు. ఆమె రాక జబర్దస్త్ కి మేలు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆమె ఇమేజ్ ఆదరణ తెచ్చిపెడుతుందని ఎంతో ఆశిస్తున్నారు. సదా క్యూట్ మాటలే కాకుండా ఆమె అందం కూడా ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు.