Sanju Samson : సంజు శాంస‌న్‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. చాన్సులు ఇచ్చినా వేస్ట్ చేస్తున్నాడే..!

Sanju Samson : టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్‌కి గ‌తంలో ఎక్కువ‌గా ఛాన్స్ లు ఇవ్వ‌క‌పోవ‌డంతో బీసీసీఐపై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేవారు. మంచి టాలెంట్ ఉన్నా కూడా సంజూ శాంస‌న్‌ని ఎందుకు పెడుతున్నారంటూ మండిప‌డేవారు. అయితే శ్రీలంక‌తో జ‌రిగిన మూడు టీ20ల సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్‌ల‌కి అతనికి అవ‌కాశం క‌ల్పించారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌటయ్యాడు. శ్రీలంకతో రెండో టీ20లో గోల్డెన్ డక్ అయిన సంజూ శాంసన్.. మూడో టీ20లోనూ పరుగులు ఏం చేయకుండానే వెనుదిరిగాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై సంజూ నిలబడలేకపోయాడు.సంజూ శాంసన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై వరుసగా రెండో గేమ్‌లోనూ నిరాశపరిచాడు.

జైస్వాల్ వికెట్ పతనం తర్వాత 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్ 4 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. భారీ షాట్ కొట్టేందుకు యత్నించిన సంజు హసరంగాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీని ద్వారా సంజూ తన పేరు మీద అవాంఛిత రికార్డు కూడా సృష్టించుకున్నాడు. సంజూ శాంసన్ వైఫల్యాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాక రాక వచ్చిన రెండు అవకాశాలను సంజూ శాంసన్ నేలపాలు చేసుకున్నాడని మండిపడుతున్నారు. దరిద్రానికే సంజూ శాంసన్ బ్రాండ్ అంబాసిడర్ అని సెటైర్లు పేల్చుతున్నారు. సంజూ శాంసన్‌ను ఎవ్వడూ రక్షించలేడని, అతని కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

indian cricket fans angry on Sanju Samson for his performance
Sanju Samson

ఓవైపు రిషభ్ పంత్ రీఎంట్రీ.. మరోవైపు ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మలతో పోటీ.. మధ్యలో రియాన్ పరాగ్ ఆల్‌రౌండర్ ఎదుగుతుండటంతో సంజూ శాంసన్‌కు జట్టులో దారులు మూసుకుపోయాయి. వికెట్ కీపర్‌గా కాకున్నా.. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ స్థానంలోనైనా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ అతని చెత్త ప్రదర్శన.. టీమిండియాకు దూరం చేసేలా ఉందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌లో రాణించ‌క‌పోయిన వికెట్ కీపింగ్ లో అయిన మెప్పించాడా అంటే అది లేదు. చెత్త కీపింగ్‌తో విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. మూడో టీ20లో నిశాంక‌, కుశాల్ మెండిస్‌ల క్యాచ్‌ల‌ని నేల పాలు చేశాడు. గ‌త 10 టీ 20ల‌లో సంజూ శాంస‌న్ ఒక్క అర్ధ సెంచరీ చేశాడు. అది కూడా జింబాబ్వేపై. మూడు మ్యాచ్‌ల‌లో డ‌కౌట్. ఈ గ‌ణాంకాల‌ని చూసి సంజూ శాంస‌న్ కెరీర్ క‌ష్టాల‌లో ప‌డ్డ‌ట్టే అని కొంద‌రు జోస్యం చెబుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago