టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం (నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఎలాగైనా గెలిచి సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం లేకపోలేదు. గత 2 రోజుల నుంచి ఆడిలైడ్‌లో తేలికపాటి జల్లులు కురుసున్నాయి. మంగళవారం కూడా అక్కడ వర్షం కురుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వాఖ్యాత హర్ష భోగ్లే ట్విటర్ వేదికగా తెలిపారు.
అదృష్టవశాత్తూ.. ఈ రోజు ఆడిలైడ్‌లో ఎటువంటి మ్యాచ్ లేదు. ప్రస్తుతం ఇక్కడ వాతావారణం చాలా కూల్‌గా ఉంది. చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి. అయితే రేపు ఇక్కడ వాతావారణం కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని భోగ్లే ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకుని హోటల్ గదులకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది.
ఒకవేళ మ్యాచ్ వాష్ అవుట్ అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. మ్యాచ్ గెలిచిన జట్టుకు 2 పాయింట్లు వస్తాయి. పాయింట్ల పట్టికలో భారత్-బంగ్లాదేశ్ రెండు జట్లు గ్రూప్ 2లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా భారత్‌తో సమానంగా 4 పాయింట్లను కలిగి ఉంది. భారత్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య పాయింట్ల పట్టికలో తేడా ఒక్క రన్ రేట్ విషయంలోనే ఉంది. దీంతో నవంబర్ 2న ఆడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌కు ఇరుజట్లకు కీలకంగా మారనుంది.