Ice Bath Challenge : బాత్‌టబ్ నిండా ఐస్ గడ్డలు వేసుకుని అందులో కూర్చోమంటే ఎవరైన కూర్చోగలరా. ఇది చాలా కష్టం.కాని ఇలా చేస్తే స్ట్రెస్ వల్ల వచ్చే వంటి నొప్పులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐస్ బాత్ కింద పిలిచే ఇలాంటి స్నానాన్ని చాలా మంది ప్రొఫెషనల్ అథ్లెట్లు, అలాగే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ శరీరానికి సమర్థవంతమైన రికవరీ సాధనంగా ఉపయోగపడుతుంది.ఐస్ బాత్ చేయడం వల్ల శరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలో సాయం చేస్తుంది. చల్లటి ఐస్ గడ్డల వల్ల మీ రక్తనాళాలు కుంచించుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. మీరు బాత్ టబ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే, ఉష్ణోగ్రతలో మార్పు వాటిని వేగంగా తిరిగి తెరవడానికి సహాయపడుతుంది.
ఇటీవల చాలా మంది ముద్దుగుమ్మలు కూడా ఐస్ బాత్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మంచు లక్ష్మి నాలుగు పదుల వయసులో కూడా సెగలు పుట్టించే గ్లామర్ తో యువతని ఆకర్షిస్తూ ఉంటుంది. తరచుగా మంచు లక్ష్మి కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ లో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి ఎవరూ ఊహించని సాహసం చేసింది. ఏకంగా బికినిలో కనిపిస్తూ ఐస్ బాత్ ఛాలెంజ్ లో పాల్గొనింది. ఫిన్లాండ్ వెకేషన్ లో భాగంగా మంచు లక్ష్మి ఐస్ వాటర్ లో బికినిలో మునుగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు మంచు లక్ష్మి ఐస్ బాత్ పై ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.. మంచు లక్ష్మి మంచు వాటర్ లో మునుగుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.
![Ice Bath Challenge : ఐస్ బాత్ ఛాలెంజ్.. మంచు లక్ష్మీ, రకుల్, ప్రగ్యా వణికిపోయారుగా..! Ice Bath Challenge rakul preet singh and manchu lakshmi with pragya jaiswal](http://3.0.182.119/wp-content/uploads/2023/12/icebath-challenge.jpg)
రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కూడా కొన్నాళ్ల క్రితం ఇలానే బికినీలో ఐస్ బాత్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. వారు చేసిన రచ్చకి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇటీవల సమంత కూడా 4 డిగ్రీల సెల్సియస్ ఐస్ బాత్ తీసుకుంటున్న వీడియోను షేర్ చేసింది. సమంత ఐస్‌తో నిండిన టబ్‌లో 6 నిమిషాలు కూర్చున్నట్లుగా ఉంది. . అనారోగ్యం మధ్య కూడా సమంత జిమ్‌కు వెళ్తోంది. తరచుగా తన వ్యాయామం, ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఫోటోలు, సమాచారాన్ని పంచుకుంటుంది.