ICC World Cup 2023 : భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీ సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం 9 స్టేడియాలను జాబితాలో ఎంపిక చేసింది. ప్రపంచ కప్‌లోని మొత్తం 48 మ్యాచ్‌లు 10 వేదికలపై జరుగుతాయి. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణె, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో భారత్ తమ మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా ఆడే వరల్డ్ కప్ ఆతిథ్య మ్యాచ్‌లలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన హైదరాబాద్, వైజాగ్ స్టేడియాలకు భారత్ ఆడే మ్యాచ్‌లకు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అయితే భారత షెడ్యూల్ విషయానికి వస్తే..అక్టోబర్ 8నఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ..చిదంబరం స్టేడియం, చెన్నైలో మ్యాచ్ జరగనుంది. తర్వాత అక్టోబర్ 11నఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్..అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీలో అలానే అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాకిస్థాన్..నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్లో అక్టోబర్ 19న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్..మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణేలో, అక్టోబర్ 22 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాలలో, అక్టోబర్ 29న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నోలో,నవంబర్ 2..ఇండియా వర్సెస్ శ్రీలంక..వాంఖడే స్టేడియం, ముంబైలో, నవంబర్ 5 ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా..ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాలో, నవంబర్ 12నఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ ((క్వాలిఫయర్ 2)M చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలు నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించాయి. సెమీఫైనల్ మ్యాచులు ముంబై, కోల్‌కతాలో జరుగుతున్నాయి. అలాగే నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.