Hyper Aadi : జబర్ధస్త్ షోతో పాపులారిటీ దక్కించుకున్నహైపర్ ఆది ప్రస్తుతం నటుడిగా కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా ‘రూల్స్ రంజన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు.సినిమా పరిశ్రమపై విమర్శలు చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సినిమాల నుంచి నేర్చుకునేది ఎంత ఉందో గుక్క తిప్పుకోకుండా చెబుతూ 14 నిమిషాల పాటు మాట్లాడాడు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజుతో మొదలుపెట్టి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు యువ నటులు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, రాణా, నాగచైతన్య, విశ్వక్‌సేన్ వరకూ ఇండస్ట్రీలోని అన్ని తరాలను, అందరు హీరోలను కవర్ చేశాడు. ఒక్కో హీరో గురించి ఒక్కో స్పెషాలిటీ చెబుతూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.
సినిమా అనేది ఎప్పుడూ మంచే నేర్పింది. చెడు ఎప్పటికీ నేర్పించదు. సినిమాల్లో చూపించే చెడును కాదు, మంచిని మాత్రమే స్వీకరించాలి. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదగిన పెద్ద ఎన్టీఆర్‌ను చూసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో, వినయం అంతే ముఖ్యమని 90 ఏళ్ల జీవితం, 75 ఏళ్ల నటన జీవితం ఉన్న ఏయన్నార్‌ను చూసి నేర్చుకోండి. అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాలు తీసి ఈ రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన, నిర్మాతకు నష్టం వస్తే డబ్బులు తిరిగిచ్చే మంచి మనసున్న కృష్ణగారిని, ఇంటికి వచ్చింది శత్రువు అయినా అన్నం పెట్టి మాట్లాడాలనే సంస్కారం ఉన్న కృష్ణం రాజుగారి నుంచి ఎంతో నేర్చుకోవాలి.
సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుని చూపించి, ఎవరికైనా పెట్టే స్థితిలో ఉండాలి కానీ నెట్టే స్థితిలో ఉండకూడదని చెప్పి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్‌బాబుగారి నుంచి నేర్చుకోవాలి. తెలుగు సినిమాలో ఏదైనా పాత్ర దక్కితే చాలనుకుని తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరిన మెగాస్టార్ చిరంజీవి చూసి నేర్చుకోండి. ఆయన తల్లికి క్యాన్సర్ వచ్చి మరణిస్తే అలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదని బసవతారకం ఆస్పత్రిని పెట్టిన బాలకృష్ణగారిని చూసి బాగా బతకడం అంటే మనం మాత్రమే కాదు.. పక్కన వాళ్లను కూడా బతికించాలని నేర్చుకోవాలి. ఆరు పదుల వయసులో కూడా ఆరోగ్యం ఉంటే అన్ని బావుంటాయని నమ్ముతూ నవ మన్మధుడిలా కనిపించే నాగార్జును, నాన్న గొప్పొడు నేను కాదు అని గ్రహించి ముందుకెళ్లే విక్టరీ వెంకటేశ్, తనకు జీవితం ఇచ్చిన గురువు దాసరి నారాయణరావు దైవంగా భావించే మోహన్‌బాబుగారిని చూసి గురు భక్తిని నేర్చుకోండి. ఎంతోమంది చిన్నారుల గుండెల్ని కాపాడుతున్న మహేశ్‌బాబుని చూసి చాలా నేర్చుకోవచ్చు. పేదల ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అని భావించి పవన్‌కల్యాన్‌ని చూసి నేర్చుకోండి సంపాదించడమే కాదు.. సహాయం చేయడం కూడా ముఖ్యమని. ప్రభాస్, రామ్‌చరణ్, బన్నీ, రానా, గోపీచంద్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్, ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు”అంటూ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…