Hyper Aadi : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ పొందిన వారిలో హైపర్ ఆది ఒకరు. ఈ యంగ్ కమెడియన్ సుదీర్ఘ కాలంగా తనదైన కామెడీతో సందడి చేస్తూ ప్రేక్షకులకు మాత్రం మస్త్ మజాను పంచుతున్నాడు. అదే సమయంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ సినీ పరిశ్రమలో దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పుడు సినిమాలు, షోలలో కనిపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న హైపర్ ఆది ఒక్కో స్కిట్‌కు ఎన్ని లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్నది కూడా సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. జబర్ధస్త్‌తో ఫుల్ పాపులారిటీ పొందిన హైపర్ ఆది.. ఆ మధ్య కొన్నాళ్ళు జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఆది నిష్క్రమణ రేటింగ్ పై తీవ్ర ప్రభావం చూపించడంతో ఇటీవల ఆది రీఎంట్రీ ఇచ్చాడు.
ప్రస్తుతం మల్లెమాల ప్రొడక్షన్ లో రూపొందుతున్న జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో తన న మార్క్ పంచులతో అలరిస్తున్నారు. ఆయన స్కిట్స్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ రాబడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా హైపర్ ఆది పెళ్లికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా హైపర్ ఆది పెళ్లి ఫోటోలు సడన్ గా ప్రత్యక్షమయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన పెళ్లి పీటలపై ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు కంగుతింటున్నారు. హైపర్ ఆదికి రహస్య వివాహం జరిగందంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇందులో నిజమెంత ఉందననే విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయగా, ఒక సినిమా సన్నివేశంలో భాగంగా హైపర్ ఆది పెళ్లి కొడుకుగా తయారని. హైపర్ ఆదితో పాటు ఉన్న ఆ పెళ్లి కూతురు సీరియల్ యాక్టర్ అని సమాచారం. గతంలో కూడా ఫోటోలు బయటకి తీసి హైపర్ ఆదికి పెళ్లి జరిగిందని ప్రచారం చేశారు. ప్రస్తుతం హైపర్ ఆది వయస్సు 32 ఏళ్లు కాగా, వీలైనంత త్వరలో పెళ్లి చేసుకుంటానని ఆయన మాట ఇచ్చారు . ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో వాస్తవం ఏమి లేదని హైపర్ ఆది సన్నిహితులు చెబుతున్నారు. తనదైన కామెడీతో బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టేశాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, ‘ఆటగదరా శివ’ అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమాకు సంభాషణలు అందించి డైలాగ్ రైటర్‌గానూ వర్క్ చేసి సత్తా చాటిన విషయం మనకు తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…