Hyper Aadi : ఒకప్పుడు హైపర్ ఆది అంటే ఎవరని అనవచ్చు కానీ ఇప్పుడు హైపర్ ఆది పేరు చెబితే తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. తన కామెడీతో, పంచ్ లతో తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు ఆది. కేవలం పంచులతో మనస్ఫూర్తిగా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం సినిమాలలో కూడా ఆది తన టాలెంట్ నిరూపిస్తున్నాడు. ఇంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది ఆస్తులు వెనకేయడంలో కూడా ముందున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని సొంత ఊరిలో ఇప్పటికే సుమారు 16 ఎకరాలు కొన్న ఆది ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితుల మాట.
హైపర్ ఆది చదివిన చదువు బీటెక్. బ్యాచ్‌లర్ రూంలో కష్టాలు పడుతూ ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఆది లైఫ్ టర్న్ చేసింది కృష్ణకాంత్ పార్క్. ఏదో ఆట విడుపు కోసం చేసిన స్ఫూప్, అందులో రాసుకున్న డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. అది చూసి అదిరే అభి.. ఆదికి జబర్దస్త్ అవకాశం ఇచ్చాడు. అది మొదలు ఎక్కడా వెనుతిరిగి చూడలేదు ఈ జబర్దస్త్ కమెడియన్. జబర్దస్త్ ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఆది ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కి లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో హైపర్ ఆది భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తుంది.
హైపర్ ఆది బిటెక్ పూర్తి చేసుకుని సంపాదన కోసం హైదరాబాద్ వచ్చే సమయంలో తన పదహారు ఎకరాల పొలం అమ్మడమే కాకుండా ఏకంగా 20 లక్షల రూపాయల అప్పు కూడా ఉండేదట. తన తండ్రి ఆది చదువుల కోసం బాగానే అప్పలు చేశాడట. అయితే హైపర్ ఆది నాన్న మూడు ఎకరాలు అమ్మి అప్పులు చేశాడట. ఒకప్పుడు అతిని పరిస్థితి, ఆయన ఫ్యామిలీ పరిస్థితి దారుణంగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఏడాదికి కోటికి పైగా సంపాదిస్తున్నాడట ఆది.