Renu Desai : పవన్ కళ్యాణ్‌తో కొన్నేళ్లపాటు సహజీవనం చేసి అనంతరం వివాహం చేసుకున్న రేణూ దేశాయ్ ఇద్దరు పిల్లలకు జన్మించింది. కొన్నాళ్లపాటు వీరు సంతోషంగానే ఉన్నా కూడా మనస్పర్ధల వలన విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు రేణూ దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో సోలోగా ఉంటుంది. అయితే విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిసారీ.. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు ప్రత్యర్ధులు. మొదటి భార్య నందిని.. రెండో భార్య రేణు దేశాయ్.. మూడో భార్య అన్నా లెజినోవా.. ఇలా పవన్ కళ్యాణ్‌కి ముచ్చటగా ముగ్గురు భార్యలు.. మూడు పెళ్లిళ్లు కావడంతో తరచూ ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శల పాలవుతూ ఉన్నారు.
రేణూ దేశాయ్ నుండి విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆమెకి ఎంత భరణం ఇచ్చారు అనేది ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇటీవల తన మాజీ భార్యలకు ఇచ్చిన భరణంపై పవన్ స్పందిస్తూ.. మొదటి భార్యకి ఐదు కోట్లు ఇచ్చాను.. విడాకులు తీసుకున్నాను. నా రెండో భార్యకి నా ఆస్తి రాసిచ్చాను.. విడాకులు తీసుకున్నాను.. ఆ తరువాత మూడో పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పారు పవన్ కళ్యాణ్. కాని రేణూ దేశాయ్ తాను భరణంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చిల్లిగవ్వ తీసుకోలేదని చెప్పింది. ‘భరణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఒంటరిగానే నా పిల్లలతో బయటకు వచ్చేశాను’ అని గతంలో చెప్పింది రేణూ దేశాయ్.

ఒకవేళ నిజంగా భరణం ఇచ్చి ఉంటే.. అది కోర్టులో జరిగే వ్యవహారమే కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ విషయం కూడా ఎక్కడా బయటకు రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా? లేదంటే రేణూ దేశాయ్ చెప్పింది నిజమా? అన్న సందిగ్ధంలో పడ్డారు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తర్వాత రేణూ దేశాయ్ పరోక్షంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఇక్కడ నీ వర్షన్ కాదు నా వర్షన్ కాదు… నిజం అనేది శాశ్వతం అని కోట్ రాసి వీడియో విడుదల చేశారు. అయితే రేణూ దేశాయ్ ని పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఆదుకోకపోతే ఆమె ఇన్నాళ్లు మనుగడ సాధించగలదా?. పూణే లాంటి పెద్ద నగరంలో ఇద్దరు పిల్లలతో లగ్జరీ లైఫ్ అనుభవించడం అంత ఈజీ కాదు అని పవన్ అభిమానులు అన్నారు. 2020 ఫిబ్రవరి నెలలో పవన్ కళ్యాణ్ తన మాజీ భార్యకి ఖరీదైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ పుకార్లు షికారు చేశాయి. పవన్ హైదరాబాద్‌లో ఐదు కోట్లు ఇల్లు కొని ఇచ్చాడని రూమర్లు హల్‌చల్ చేశాయి.